Sonam Dayah | క‌డుపులో ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన డాక్ట‌ర‌మ్మ‌.. వీడియో

Sonam Dayah | ఆమె క‌డుపులో ఇద్ద‌రు క‌వ‌ల‌లు( Pregnant with Twins ).. ప్ర‌స‌వానికి ద‌గ్గ‌ర్లోనే స‌మ‌యం ఉన్న‌ట్టుంది. ఈ స‌మ‌యంలో ఎంతో సుర‌క్షితంగా ఉండాల్సిన ఆ గ‌ర్భిణి( Pregnant ).. మాస్ డ్యాన్స్‌( Mass Dance )తో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వృత్తిరీత్యా డాక్ట‌ర్( Doctor ) అయిన ఆవిడ‌.. క‌డుపులో క‌వ‌ల‌లు ఉన్న‌ప్ప‌టికీ ఎంతో కాన్ఫిడెంట్‌గా చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

Sonam Dayah | క‌డుపులో ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌తో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన డాక్ట‌ర‌మ్మ‌.. వీడియో

Sonam Dayah | గ‌ర్భం( Pregnant ) దాల్చిన ప్ర‌తి మ‌హిళ ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు. కాలు తీసి కాలు పెట్టేందుకు కూడా కొన్ని సంద‌ర్భాల్లో వెనుకాడుతుంటారు. ఎందుకంటే క‌డుపులో పెరుగుతున్న బిడ్డ‌కు ఏదైనా హానీ జ‌రుగుతుందేమోన‌న్న భ‌యంతో. కానీ క‌డుపులో క‌వ‌ల‌లు( Pregnant with Twins ) పెరుగుతున్నార‌ని తెలిసి కూడా ఓ గ‌ర్భిణి( Pregnant Woman ) మాస్ డ్యాన్స్‌( Mass Dance )తో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వృత్తి రీత్యా డాక్ట‌ర్ అయిన ఆవిడ డింగ్ డాంగ్ డింగ్( Ding Dong Ding ) అనే పాపుల‌ర్ పాట‌కు స్టెప్పులేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

సోన‌మ్ ద‌యాహ్( Sonam Dayah ) అనే మ‌హిళ వృత్తిరీత్యా డాక్ట‌ర్( Doctor ). ఆమె గ‌ర్భం దాల్చిన త‌ర్వాత క‌వ‌ల పిల్ల‌లు పెరుగుతున్న‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు క‌డుపులో పెరుగుతున్నందున ఆమె మ‌రింత విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి.. సాధార‌ణ మ‌హిళ‌లాగా అన్ని చ‌క‌చ‌కా చేసేస్తోంది. అంతేకాదు.. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ అదిల్ ఖాన్‌( Adil Khan )తో క‌లిసి డింగ్ డాంగ్ డింగ్ (Ding Dong Ding) అనే పాపుల‌ర్ పాట‌కు మాస్ స్టెప్పుల‌తో అంద‌ర్నీ ఊర్రుత‌లూగించింది.

సోన‌మ్ డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు నెటిజ‌న్లు. కొంద‌రు ఇది ప్ర‌మాదం అని హెచ్చ‌రించ‌గా, మ‌రికొంద‌రేమో సూప‌ర్బ్ అంటూ ఆమెను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. సోన‌మ్ పిల్ల‌లు క‌చ్చితంగా భ‌విష్య‌త్‌లో డ్యాన్స‌ర్లు అవుతార‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం సోన‌మ్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. మ‌రి మీరు ఓ లుక్కేయండి..