Russian Dancers Viral Video : పుతిన్ భారత్ పర్యటన..అదరగొట్టిన రష్యన్ డాన్సర్స్

పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా రష్యన్ యువ కళాకారుల డాన్స్ ప్రదర్శన వైరల్. భారతీయ పాటలకు అదరగొట్టిన రష్యన్ డాన్సర్లు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.

Russian Dancers Viral Video : పుతిన్ భారత్ పర్యటన..అదరగొట్టిన రష్యన్ డాన్సర్స్

విధాత : మన మిత్ర దేశం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. నాలుగేళ్ల తర్వాత మన దేశానికి వచ్చిన పుతిన్‌ పర్యటనకు భారత ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ లు కలిసి డిన్నర్ చేయబోతున్నారు. పుతిన్ కోసం ప్రత్యేక భారతీయ వంటకాలతో ఆకట్టుకునే డిషెస్ సిద్దం చేశారు.

మరోవైపు పుతిన్ కు ఘన స్వాగతం పలికేందుకు..భారత్, రష్యాల మధ్య మైత్రి బంధాన్ని చాటుతూ..రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భారత్, రష్యా కళాకారులు బృందాలు పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలతో పుతిన్ బృందాన్ని అలరించబోతున్నాయి. ఇందుకోసం రష్యా యువ కళకారుల బృందం తమ సన్నాహకాలలో భాగంగా చేసిన నృత్య ప్రదర్శన వైరల్ గా మారింది. అందులో రష్యన్ యువతీయువకులు భారతీయ పాటలకు అద్భుతంగా డాన్స్ చేసిన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. వారి డాన్స్ ప్రదర్శన రెండు దేశాల మధ్య నెలకొన్న బలమైన సాంస్కృతిక బంధానికి నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా ఆ డాన్స్ వీడియో చూసేయండి మరి.

ఇవి కూడా చదవండి :

Elephant Pushes Policeman : భక్తులకు నాకు మధ్య నువ్వేంది..పోలీసును ఎత్తిపడేసిన ఏనుగు
CM Revanth|| నేడు ఆదిలాబాద్‌లో పర్యటించనున్న సీఎం