కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలకు సంబంధించి 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 8వ తేదీ వరకూ నామినేషన్ల ధాఖలు ప్రక్రియ కొనసాగనుంది.

దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలకు సంబంధించి 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 8వ తేదీ వరకూ నామినేషన్ల ధాఖలు ప్రక్రియ కొనసాగనుంది. 9న నామినేషన్ల పరిశీలన, జూన్ 11వ తేదీన ఉపసంహరణ, 18న పోలింగ్, ఫలితాల వెల్లడి నిర్వహిస్తారు. జూన్ 20నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయనున్న 7గురు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. కర్ణాటక నుంచి రాజ్యసభ టికెట్ ఆశించిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలకు మొండిచేయి ఎదురైంది. కర్నాటక నుంచి ముగ్గురు అభ్యర్ధులు మల్లిఖార్జున్ ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలిఖాన్ లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. మధ్య ప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్, ఝార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝా, తమిళనాడు నుంచి ప్రణవ్ చక్రవర్తి, రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగీలను అభ్యర్థులుగా ప్రకటించారు.

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మొత్తం 5 రాష్ట్రాల నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను పార్టీ తాజాగా విడుదల చేసింది. వీరిలో తరుణ్‌చుగ్‌, సతీష్‌ పూనియా, రాజూభాయ్‌ శుక్లా, ముకేశ్‌భాయ్‌ రత్వా, మన్‌సింగ్‌ పర్మార్‌, జితేంద్ర మేఘ్‌జీభాయ్‌ కంజరియా, రాజ్‌నీష్‌ అగర్వాల్‌, దేబాశిష్‌ సమంతరాయ్‌, అల్కా గుర్జార్‌, శారదా దేవీ, తాయ్‌ తగాక్‌ ఉన్నారు.

ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో 4 స్థానాల చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకు, జార్ఖండ్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలలో ఒక్కో స్థానం చొప్పున ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా రాష్ట్రాలలో బీజేపీ, ఎన్డీఏ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యాబలం మేరకు 17 నుంచి 20 స్థానాల వరకు గెలుచుకోవాలని కేంద్రం కసరత్తు చేస్తుంది.

Latest News