పురుషుడా? మహిళా? ఆ వ్యక్తికి స్త్రీపురుష జననాంగాలు!

ప్రకృతిలో అప్పుడప్పుడు వింతలు జరుగడం సహజంగా మనం చూస్తుంటాం. అటువంటిదే ఒక వింత ఛత్తీస్ ఘడ్ లో సోమవారం ఏప్రిల్‌ 1న వెలుగులోకి వచ్చింది

పురుషుడా? మహిళా? ఆ వ్యక్తికి స్త్రీపురుష జననాంగాలు!

ప్రకృతిలో అప్పుడప్పుడు వింతలు జరుగడం సహజంగా మనం చూస్తుంటాం. అటువంటిదే ఒక వింత ఛత్తీస్ ఘడ్ లో సోమవారం ఏప్రిల్‌ 1న వెలుగులోకి వచ్చింది

లక్ష మంది లో ఒకరికి ఇలా జరుగవచ్చు.

దేశంలోనే ఇది మూడవ కేసు

రాయపూర్ : ప్రకృతిలో అప్పుడప్పుడు వింతలు జరుగడం సహజంగా మనం చూస్తుంటాం. అటువంటిదే ఒక వింత ఛత్తీస్ ఘడ్ లో సోమవారం ఏప్రిల్‌ 1న వెలుగులోకి వచ్చింది. ఆ వింత మామూలు ప్రజానీకాన్నే కాదు వైద్య రంగాన్ని కూడా కదిలించింది. ఆ వింత వివరాలేంటో చూద్దాం.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ కు చెందిన 26 ఏండ్ల యువకుడు జీవ వైవిధ్యం (ఇంటర్ సెక్స్)తో బాధ పడుతూ డాక్టర్ల సహాయం కొరకు రాయపూర్ లోని అంబేడ్కర్ హాస్పటల్‌కు వచ్చాడు.

కాగా.. అతని సమస్య, అతనిలో స్త్రీ– పురుష.. రెండు జననాంగాలు వృద్ధి అయి వున్నాయి. అయితే స్త్రీ జననాంగంలో కణతి ఏర్పడింది. డాక్టర్ల పరీక్షలో ఈ వింత బయటపడింది. డాక్టర్ల రిపోర్టు ప్రకారం ఈ కేసు దేశంలోనే మూడవది. అత్యంత అరుదుగా ఒక లక్ష మందిలో ఒకరికి ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని డాక్టర్లు అంటున్నారు.

ఛత్తీస్ ఘడ్ లోని ఆయుర్విజ్ఞాన్‌ (సిఐఎమ్ ఎస్)లో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా వున్నాడు. కాని ఆయన పూర్తిగా కోలుకోవాలంటే రెండు సంవత్సరాలు పట్టవచ్చని డాక్టర్లు చెప్పుతున్నారు. ఈ సమస్యను మెడికల్ భాషలో డీఎస్‌డీ అంటే డిజార్డర్‌ ఆఫ్‌ సెక్సువల్‌ డెవలప్‌మెంట్‌ అంటారు. ఆరు నెలల ట్రీట్ మెంట్‌లో అతనికి 12 సార్లు కీమోథెరపీ ఇచ్చారు. అతని మహిళా జననాంగంలో ఒక ప్రత్యేక తరహా క్యాన్సర్ వచ్చింది. ఆపరేషన్ ద్వారా క్యాన్సర్‌ కణితిని తొలగించారు.

అయితే ఈ సందర్భంగా అతని ఒక అండాశయాన్నికూడా తొలగించారు. దాంతో ఆయన తండ్రి అయ్యే అవకాశం బహుశా లేదని డాక్టర్లు తెలిపారు. డాక్టర్ చంద్ర హాస్ ద్రువ్ ప్రకారం ఈ సమస్య తలెత్తడానికి ముఖ్యంగా తల్లీ గర్భంలోని శిశువులో జరిగే హార్మోనుల, ఎంజైముల తేడాల వల్ల క్రోమోజోముల్లో భిన్న భిన్న జోడీలు ఏర్పడి స్త్రీ కానీ, లేదా పురుష కానీ కాకుండా రెండింటి సమ్మేళనంతో క్రోమోజోముల సంఖ్య లోనూ, జోడీలలోనూ విపరీత తేడాలు వచ్చి ఇటువంటి అరుదైన డీఎస్‌డీకి గురవుతారు.