genetic skin disease| రాయిలా మారుతున్న బాలిక శరీరం!

ఓ బాలిక శరీరం రాయిలా..చెట్టు బెరడులా మారిపోతున్న వింత ఘటన వైరల్ గా మారింది. అంతు పట్టని ఈ వింత వ్యాధి ఆ బాలికకు నిత్య నరకంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజేశ్వరి అనే చిన్నారి ‘ఇక్తియోసిస్’ అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది.

genetic skin disease| రాయిలా మారుతున్న బాలిక శరీరం!

విధాత : ఓ బాలిక శరీరం రాయిలా..చెట్టు బెరడులా మారిపోతున్న వింత ఘటన వైరల్ గా మారింది. అంతు పట్టని ఈ వింత శరీర వ్యాధి(Skin Disease) ఆ బాలికకు నిత్య నరకంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh )కు చెందిన రాజేశ్వరి అనే చిన్నారి ‘ఇక్తియోసిస్’ (Ichthyosis)అనే అరుదైన జన్యు వ్యాధి(genetic skin disease)తో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా చర్మ పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బతిని, ఆమె శరీరం క్రమంగా రాయిలా, చెట్టు బెరడులా, చేప పొలుసుల వలే మారుతోంది. దీంతో ఒళ్లంతా పొలుసులుగా మారిన శరీరం ఆ బాలికను తీవ్ర వేదనకు గురిచేస్తుంది. ఈ వ్యాధిని “ఫిష్ స్కేల్ డిసీజ్” (చేప పొలుసుల వ్యాధి) అని కూడా పిలుస్తారు. ‘ఇక్తియోసిస్’ వ్యాధికి ప్రధాన ఫిలగ్రిన్ జన్యువు లోపం. ఫిలగ్రిన్ అనే ప్రోటీన్ చర్మం పైపొరలోని కణాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడానికి సహాయ పడుతుంది. ఈ జన్యువులో లోపం ఉన్నప్పుడు, చర్మం తేమను కోల్పోయి, డెడ్ స్కిన్ సెల్స్ బయటకు పోకుండా లోపలే పేరుకుపోతాయి. దీనివల్ల చర్మం పొడిబారి, పొలుసులుగా మారుతుంది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందని చెబుతున్నారు.

వినడానికి, చూడటానికి భయం గొల్పో ఈ వ్యాధి నివారణకు శాశ్వత పరిష్కారం లేదని, కేవలం లక్షణాలను నియంత్రించగలమని వైద్యులు పేర్కొంటుండటం మరింత ఆందోళన కల్గిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ బాలిక వింత వ్యాధి వీడియోలు చూసిన నెటిజన్లు ఇంత కష్టం ఎవరికి రావద్దని..వైద్యులు ఈ వ్యాధి నివారణకు మందులు కనిపెట్టాలని కోరుతున్నారు.