Delhi Blast | “చుట్టూ ఛిద్రమైన శరీరాలు” – రెడ్‌ఫోర్ట్‌ పేలుడు భయానక దృశ్యాలు

రెడ్‌ఫోర్ట్‌ పేలుడు తర్వాత ఢిల్లీలో చోటుచేసుకున్న భయానక దృశ్యాలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. సాక్షులు “చుట్టూ చిగురుటాకులా శరీరభాగాలు తెగిపడ్డాయి” అంటున్నారు. ఇదే సమయంలో ఇది ఢిల్లీలో మూడో పెద్ద దాడిగా చరిత్రలో నమోదైంది.

red-fort-blast-eyewitness-horror-delhi-third-attack-since-1997

“Bodies Scattered Like Leaves”: Eyewitness Horror After Red Fort Blast, Delhi’s Third Major Attack Since 1997

(విధాత నేషనల్​ డెస్క్​)

న్యూఢిల్లీ, నవంబర్‌ 10:
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం లాల్‌‌ఖిల్లా మెట్రో స్టేషన్‌ సమీపంలో జరిగిన భారీ కారు పేలుడు దృశ్యం భయానకంగా ఉంది. పేలుడు తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం సాక్షుల మాటల్లోనే వర్ణనాతీతంగా మారిపోయింది

“చుట్టూ చిగురుటాకులా శరీరాలు పడి ఉన్నాయి. ఒకరి చేయి రోడ్డు మీద కదులుతూ కనిపించింది. శబ్దం చెవులు పగిలిపోయేంత భయంకరంగా ఉంది,” అని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. మరో స్థానికుడు చెబుతూ, టెర్రస్‌ మీద నిలబడి చూసాను. పెద్ద అగ్నిగోళంలా మంటలు ఎగిసాయి. క్షణాల్లోనే కార్లు మంటల్లో కరిగిపోయాయని కన్నీటి గొంతుతో వివరించాడు.

పేలుడు జరిగిన ప్రాంతం – లాల్‌ఖిల్లా మెట్రో గేట్‌ నంబర్‌ 1 సాధారణంగా సాయంత్రం రద్దీగా ఉంటుంది. అక్కడ చిన్నారుల నుండి విదేశీ పర్యాటకుల వరకు వందల మంది ఉంటారు.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు అంతా అకస్మాత్తుగా జరిగింది, ఎవరికీ స్పందించడానికి సమయం దొరకలేదు. నాకు భూమి కంపించినట్లనిపించింది. దగ్గరలో ఉన్న గుడిసెలు కంపించాయి. బయటికి వచ్చేసరికి పొగతో మొత్తం రోడ్డు నిండిపోయిందని ఒక వృద్ధుడు వివరించాడు.
పోలీసులు చెప్పినట్లు, పేలుడు తర్వాత ఆ కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది. సమీపంలోని వాహనాలు కూడా ఎగిసిపడ్డాయి. రోడ్డుపై కరిగిన లోహం, విరిగిన గాజు, రక్తపు మరకలు — ఆ దృశ్యం భయంకరంగా కనిపించింది.

ఢిల్లీలో మూడో పెద్ద దాడి – రెడ్‌ఫోర్ట్‌ లక్ష్యంగా మరోసారి

భద్రతా వర్గాల ప్రకారం, రెడ్‌ఫోర్ట్‌ పేలుడు మూడోసారి ప్రాంతం టెర్రరిస్ట్‌ దాడికి వేదికైన ఘటన.
1997 నవంబర్‌ 30, రెడ్‌ఫోర్ట్‌ ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు.
2000 జూన్‌ 18, రెడ్‌ఫోర్ట్‌ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించి ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు.
ఇప్పుడు, 2025 నవంబర్‌ 10, రెడ్​ఫోర్ట్​ మెట్రో గేట్‌ వద్ద జరిగిన భారీ పేలుడు ఢిల్లీని మరోసారి భయాందోళనకు గురి చేసింది.

గతంలో కూడా ఢిల్లీ పలు ప్రధాన ప్రాంతాలు దాడులకు గురయ్యాయి —

ఇప్పుడు మళ్లీ రెడ్‌ఫోర్ట్‌ పేలుడు చరిత్రను గుర్తుచేస్తూ, భద్రతా లోపాలపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతోంది.

భద్రతా వర్గాల కథనాల ప్రకారం, ఈ దాడి యాదృచ్ఛికం కాదు. ఒకే ప్రాంతాన్ని పదేపదే టార్గెట్‌ చేయడం వెనుక ప్రగాఢమైన ఉద్దేశం ఉంది. ఇది జాతీయ భద్రతకు సవాలని ఒక సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. NIA, NSG బృందాలు పేలుడు స్థలంలో ఆధారాలు సేకరిస్తూ, ఫోరెన్సిక్‌ అనాలిసిస్‌ కొనసాగిస్తున్నాయి. పేలుడు దృశ్యాలు, రోడ్డు మీద చెల్లాచెదురైన శరీర భాగాలు, పొగతో కప్పబడిన ఆకాశం — ఢిల్లీ గుండెల్లో మరోరాత్రి చేసిన గాయంగా మారిపోయింది.