Revanth Reddy| అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో అత్యంత శక్తివంతమైన 2026 సంవత్సరం వ్యక్తుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు. గత 2025 సంవత్సరం ఈ జాబితాలో 28వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఏడాది సర్వేలో మరింత ప్రజాదరణతో 25వ స్థానానికి ఎగబాకారు.

విధాత : దేశంలో అత్యంత శక్తివంతమైన 2026 సంవత్సరం వ్యక్తుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు. గత 2025 సంవత్సరం ఈ జాబితాలో 28వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఏడాది సర్వేలో మరింత ప్రజాదరణతో 25వ స్థానానికి ఎగబాకారు. 2024 సంవ‌త్సర‌పు జాబితాలో 39 స్థానంలో ఉన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన 2026 టాప్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాను రిలీజ్ చేశారు.ఈ జాబితాలో ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు. వరుసగా 12వ సంవత్సరం కూడా, ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ జాబితాలో నరేంద్ర మోదీ, అమిత్ షా మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. మోహన్ భగవత్ 3, రాజ్ నాధ్ సింగ్ 4, పీయూశ్ గోయల్ 5వ, , నిర్మలా సీతారామన్ 6 ,ఎస్ జైశంకర్‌లు 7వ స్థానాలతో , యోగి ఆధిత్యనాధ్ 8, రాహుల్ గాంధీ 9, కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ 10వ స్థానంతో టాప్ 10లో చేరారు. చంద్రబాబు 13వ స్థానంలో, మమతా బెనర్జీ 15 స్థానంలో ఉన్నారు.

వ్యక్తిత్వం…పాలన సామర్ధ్యంతో రేవంత్ కు గుర్తింపు

ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా సీఎం రేవంత్ రెడ్డి ఛరిస్మా.. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్య‌క‌లాపాలు, దేశ‌వ్యాప్తంగా ఇండియా కూట‌మిలో పోషిస్తున్న ప్ర‌ముఖ‌మైన పాత్ర‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు ల‌భించింది. ప్రతిపక్షాలపై త‌నదైన దూకుడుతో భార‌త‌ రాజకీయాల్లో ఆయ‌న చూపుతున్న ప్ర‌భావం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న ర్యాంకు మెరుగుప‌డిందని సమాచారం. కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్లు, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ వంటి అంశాలు ప్రజల్లో ఆయన పాపులారిటీ పెరుగుదలకు దోహదం చేశాయని సర్వే అభిప్రాయపడింది.

శ‌క్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ 17వ స్థానం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 20వ స్థానంలో, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ 21వ స్థానంలో నిలవడం విశేషం. జాతీయ భద్రతా సలహాదారు (NSA అజిత్ దోవల్ కూడా 29వ స్థానానికి ఎగబాకారు. ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆరేళ్లకు పైగా పనిచేస్తున్న పీకే మిశ్రా 32వ స్థానానికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా 35వ స్థానానికి ఎగబాకారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 34 స్థానాలు ఎగబాకి ప్రస్తుతం 55వ స్థానంలో ఉన్నారు. బీహార్‌కు వీడ్కోలు పలికిన మాజీ సీఎం నితీశ్ కుమార్ త 63 ర్యాంకులు దిగజారి 84వ స్థానానికి పడిపోయారు.

Latest News