సముద్రంలో శివలింగం ప్రత్యక్షం ..!

పురాతన శివలింగం ఒకటి సముద్రంలో వెలుగుచూడటం సంచలనం రేపింది. తిరుపతి జిల్లా గూడూరు తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం దర్శనమిచ్చింది.

సముద్రంలో శివలింగం ప్రత్యక్షం ..!

విధాత, హైదరాబాద్ : పురాతన శివలింగం ఒకటి సముద్రంలో వెలుగుచూడటం సంచలనం రేపింది. తిరుపతి జిల్లా గూడూరు తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం దర్శనమిచ్చింది. పర్యాటకులు బీచ్‌లో స్నానాలు చేస్తుండగా వారికి శివలింగం కనిపించడంతో అంతా కలిసి అతి కష్టం మీద దానిని ఒడ్డుకు చేర్చారు. భక్తితో శివలింగానికి సముద్ర జలాలతో అభిషేకం చేసి పరవశించారు. శివలింగం దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించి ఆనందం వ్యక్తం చేశారు.

సముద్ర జలాల్లో శివలింగం ప్రత్యక్షమైన సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అభిషేకాలు, పూజలు చేయడం ప్రారంభించడంతో బీచ్ ప్రాంతం పర్యాటక శోభతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా సంతరించుకుంది.