Spitting on Rotis | ఈ వీడియో చూస్తే.. పెళ్లి వేడుక‌లో జ‌న్మ‌లో రోటీలు తిన‌రు..!

Spitting on Rotis | పెళ్లిళ్లు( Marriages ) అంటేనే చాలా మంది భోజ‌నం( Dinner ) చేసేందుకు వెళ్తుంటారు. ఎందుకంటే పెళ్లి వేడుక‌లో వెజ్( Veg ), నాన్ వెజ్( Non Veg ) వంట‌కాల‌కు సంబంధించి అనేక వెరైటీలు ల‌భిస్తాయ‌ని. ఇక త‌మ‌కు ఇష్ట‌మొచ్చిన వంట‌కాల‌ను క‌డుపు నిండా ఆర‌గిస్తారు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం వివాహ వేడుక‌లో జ‌న్మ‌లో కూడా రోటీలు( Rotis ) తిన‌రు.

  • By: raj |    national |    Published on : Nov 05, 2025 8:39 AM IST
Spitting on Rotis | ఈ వీడియో చూస్తే.. పెళ్లి వేడుక‌లో జ‌న్మ‌లో రోటీలు తిన‌రు..!

Spitting on Rotis | ఉత్త‌ర‌ప్ర‌దేశ్( Uttar Pradesh ) బులంద్‌షార్ జిల్లాలోని ప‌హ‌సు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో న‌వంబ‌ర్ 2వ తేదీన ఓ పెళ్లి వేడుక( Marriage Function ) జ‌రిగింది. ఆ వివాహ వేడుక‌లో విందుకు సంబంధించి అనేక ర‌కాల వంట‌కాలను త‌యారు చేయించారు. అయితే రోటీలు( Rotis ) త‌యారు చేస్తున్న ఓ వ్య‌క్తి మాత్రం పాడుప‌నికి పాల్ప‌డ్డాడు. రోటీల‌ను త‌యారు చేస్తూ ప్ర‌తి రోటీపై త‌న ఉమ్మును ఉమ్మేశాడు( Spitting on Rotis ). ఆ త‌ర్వాత దాన్ని కాల్చి అతిథుల‌కు స‌ర‌ఫ‌రా చేశారు.

ఈ దృశ్యాల‌ను అక్క‌డున్న ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశాడు. పోలీసుల దాకా ఈ వీడియో చేర‌డంతో వారు సీరియ‌స్‌గా తీసుకున్నారు. రోటీలు త‌యారు చేసిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని ప‌టాన్ తోల ప్రాంతానికి చెందిన డానిష్‌గా గుర్తించారు. అనంత‌రం కేసు న‌మోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు.. ఇలాంటి చ‌ర్య‌లు స‌హించ‌బోమ‌ని తేల్చిచెప్పారు. క‌డుపుకు తినే ఆహారం విష‌యంలో ప‌రిశుభ్ర‌త‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని పోలీసులు చెప్పారు. పెళ్లిళ్ల నిర్వాహ‌కులు వంట మాస్ట‌ర్ల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. డానిష్ త‌న ఉమ్మును రోటీల‌పై ఉమ్మి పైశాచిక ఆనందం పొందిన‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ చ‌ర్య‌కు ఎందుకు పాల్ప‌డ్డాడు అనే విష‌యంపై స్ప‌ష్ట‌త లేద‌న్నారు పోలీసులు. మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి ఆ వీడియోపై.