వన్య ప్రాణులను బతికించండి వేటాడినా,చంపినా కఠిన చర్యలు తీసుకుంటాం … పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ చీఫ్ పెరేన్

వన్య ప్రణులను చంపకుండా బతికించాలని పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ చీఫ్ పెరేన్ కోరారు. వన్య ప్రాణులను వేటాడినా, చంపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం మహావీర్ హరిణవనస్థలి జాతీయ పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ వేట సామాగ్రిని ప్రదర్శించారు.

వన్య ప్రాణులను బతికించండి వేటాడినా,చంపినా కఠిన చర్యలు తీసుకుంటాం … పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ చీఫ్ పెరేన్

విధాత: వన్య ప్రణులను చంపకుండా బతికించాలని పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ చీఫ్ పెరేన్ కోరారు. వన్య ప్రాణులను వేటాడినా, చంపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం మహావీర్ హరిణవనస్థలి జాతీయ పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ వేట సామాగ్రిని ప్రదర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేటగాళ్లు వలలు, ఉచ్చులు, కరెంట్ వైర్, విషం, పేలుడు పదార్థాలు మొదలైన వాటిని ఉపయోగించి వన్యప్రాణులను వేటాడి చంపుతున్నారన్నారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు ఎవరు చేసిన సహించమన్నారు. వన్యప్రాణులను వేటాడే ప్రయత్నాలను నివారించడానికి, 1 డిసెంబర్ 2023 నుండి స్టేట్ వైడ్ ఇంటెన్సివ్ ప్రివెంటివ్ డ్రైవ్ “క్యాచ్ ది ట్రాప్” ను ప్రారంభించడం జరిగిందన్నారు. వన్యప్రాణులను వేటాడకుండా రక్షించడానికి మొట్టమొదటిసారిగా ఈ రకమైన నివారణ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం కింద అటవీ శాఖ సిబ్బంది ఆయా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి వేటకు సంబంధించిన గత రికార్డులలో ఉన్న వ్యక్తులను, అనుమానితులను విచారించి, వేట కోసం వారు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. వ్యవసాయ క్షేత్రాలు , అడవికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో క్షున్నంగా తనిఖీలు నిర్వహించి వలలు, ఉచ్చులు, పంజాలు మొదలైన అన్ని రకాల పరికరాలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
అడవుల్లో వేటగాళ్లు ప్రధానంగా వన్యప్రాణులను చంపడానికి కరెంట్ వైర్లను ఉపయోగిస్తున్నారన్నారు. లైవ్ వైర్‌ను తాకడం ద్వారా విద్యుదాఘాతం కారణంగా గతంలో మనుషులు చనిపోయిన సందర్భాలున్నాయని తెలిపారు. జనవరి 2023న రాజన్న-సిరిసిల్లలోని రుద్రంగి మండలం గుగులోత్ మంగ్యా నాయక్,ఏప్రిల్ 2023న ఆరేపల్లి (వి) భీమారం మండలం మంచిర్యాలకు చెందిన రాజన్న, డిసెంబర్ 2023న ఖమ్మంలోని కారేపల్లి రేంజ్ సింగరేణి మండలం బాజుమల్లాయిగూడెంకు చెందిన డి.సుధాకర్,జనవరి 2024న కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు) మండలం చాప్రి గ్రామ సమీపంలో కోట్నాయక్ భీంరావు, ఫిబ్రవరి 2024న జయశంకర్ భూపాలపల్లిలోని నస్తూర్‌పల్లి(వి) కాటారం మండలంలో కూంబింగ్ ఆపరేషన్‌లో గ్రేహౌండ్స్ కమాండో ఎ ప్రవీణ్, ఫిబ్రవరి 2024న ఆదిలాబాద్ జిల్లా భూతై (వి) బజర్‌హత్నూర్‌కు చెందిన పెండోర్ లక్ష్మణ్ లు విద్యుత్ఘాతంతో మరణించారన్నారు. గత 4 సంవత్సరాలలో విద్యుదాఘాతానికి గురై 57 వన్యప్రాణులు చనిపోయాయన్నారు. ఈ సందర్భంగా వన్య ప్రాణులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్న అధికారులను పీసీసీఎఫ్ అభినందించారు.