BJP | మోదీపై సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ఆదివారం నాడు సోషల్ మీడియాలలో పెట్టిన ఓ పోస్టు కలకలం రేపింది. ఓ మాజీ కేంద్ర మంత్రి అనుచిత ప్రవర్తన కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉందని ఆరోపించారు.

Reported by: chinna | జాతీయం | Nov 30, 2025, 7:41 pm IST
Read Time: 3 mins
BJP | మోదీపై సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ఆదివారం నాడు సోషల్ మీడియాలలో పెట్టిన ఓ పోస్టు కలకలం రేపింది. ఓ మాజీ కేంద్ర మంత్రి అనుచిత ప్రవర్తన కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమెరికా బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. బ్రహ్మచారిగా మోదీకి ఉన్న ఇమేజ్ అతని వ్యక్తిగత జీవితంలోని అంశాలకు విరుద్దంగా ఉందన్నారు. . ఇది భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసోందన్నారు. అయితే ఈ వాదనలకు మద్దతుగా సుబ్రమణియన్ స్వామి ఎలాంటి ఆధారాలు అందించలేదు.

భారత ప్రభుత్వం కానీ, అమెరికా అధికారులు కానీ, ఇందుకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఈ ఆరోపణలు ధృవీకరించలేదు. సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు ప్రశ్నించారు. ఈ ఆరోపణల విశ్వసనీయతను ప్రశ్నించారు. ఇలాంటి అంశాల విషయంలో ఆధారాలు లేకుండా పోస్టులు పెట్టడాన్ని తప్పుబట్టారు. ఆధారాలు లేని ఆరోపణలు అంటూ నెటిజన్లు కొట్టిపారేశారు. రాజకీయ ఉద్రిక్తతల మధ్య వివాదాన్ని మరింత పెంచేందుకు స్వామి ప్రయత్నిస్తున్నారని మరికొందరు విమర్శించారు. బీజేపీ నాయకత్వానికి సుబ్రమణియన్ స్వామికి మధ్య గ్యాప్ ఉంది. తరచుగా మోదీ సర్కార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సుబ్రమణియన్ స్వామి వార్తల్లో నిలుస్తున్నారు.