Apple Santa : శాంటా క్లాజ్ శిల్పంతో పూరీ కళాకారుడి వరల్డ్ రికార్డ్

పూరీ బీచ్‌లో 1.5 టన్నుల ఆపిల్స్‌తో సుదర్శన్ పట్నాయక్ భారీ శాంటా క్లాజ్ శిల్పాన్ని రూపొందించి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ప్రపంచ శాంతిని చాటేలా ఉన్న ఈ కళాకృతి వివరాలివే!

Apple Santa : శాంటా క్లాజ్ శిల్పంతో పూరీ కళాకారుడి వరల్డ్ రికార్డ్

విధాత: ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పర్వదినం సంబరాల్లో మునిగితెలుతున్న సందర్భంలో ఒరిస్సా పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్ప కళాకారుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుదర్శన్ పట్నాయక్ మాత్రం ఓ అద్బుతాన్ని సృష్టించే పనిలో నిమగ్నమయ్యాడు. క్రిస్మస్ వేడుకల్లో కీలకమైన శాంటా క్లాజ్ కు చెందిన భారీ సైకత..ఆపిల్ పండ్ల శిల్పాన్ని రూపొందించి ఆవిష్కరించాడు. పూరిలోని సముద్ర తీరం నీలాద్రి బీచ్‌లో ఇసుకతో 60 అడుగుల పొడవు, 22 అడుగుల ఎత్తు, 45 అడుగుల వెడల్పుతో భారీ శాంటా క్లాజ్ సైకత శిల్పాన్ని రూపొందించిన పట్నాయక్ దానికి యాపిల్స్ ను అమర్చి ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్-అండ్-సాండ్ శాంటా క్లాజ్ శిల్పాన్ని రూపకర్తగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్రిస్మస్ వేళ నెట్టింటా వైరల్ గా మారింది.

పట్నాయక్ శ్రమ ఫలించి ఈ శాంటా క్లాజ్ శిల్పాన్ని వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద ఆపిల్-అండ్-సాండ్ ఇన్‌స్టాలేషన్‌గా గుర్తించింది. 22వ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవం సందర్భంగా 2025 క్రిస్మస్ ఈవ్ కోసం పట్నాయక్ ఆ అరుదైన ఫీట్ సాధించడం విశేషం. శాంటా క్లాజ్ ఆపిల్-అండ్-సాండ్ శిల్పం తయారీకి 1.5 టన్నుల ఆపిల్స్ వినియోగించారు. శాంటా క్లాజ్ చేతిలో “ప్రపంచ శాంతి” అని చెక్కబడిన నీలి-ఆకుపచ్చ గ్లోబ్ ను అమర్చడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సంస్థకు చెందిన 30 మంది విద్యార్థుల సహకారంతో ఈ కళాకృతిని రూపొందించారు.

సముద్రతీర ప్రదేశంలో కొలువుతీరిన శాంటా క్లాజ్ విగ్రహాన్ని చూసేందుకు భారీ జనం తరలివచ్చారు. సందర్శకులను, పర్యాటకులను ఇది ఎంతగానో ఆకట్టుకుంది. క్రైస్తవ సోదురులైతే అక్కడే క్రిస్మస్ వేడుకలతో సందడి చేశారు. డిసెంబర్ 24 నుంచి ప్రారంభమైన 22వ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవం జనవరి 1వరకు కొనసాగనుంది. ఈ ఉత్సవాన్ని స్థానిక పూరీ బీచ్‌లో పేరొందని ఛాయ్ వ్యాపారి ‘మిటు చాయ్’గా పిలువబడే పూర్ణచంద్ర సాహూ ప్రారంభించడం విశేషం.

ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సీజన్‌లో ప్రపంచ శాంతి, ఐక్యత, సంతోషాల సందేశాలను చాటడానికి తాను శాంటా క్లాజ్ కళాకృతిని రూపొందించినట్లు తెలిపారు. యాపిల్స్, ఇసుకతో తయారు చేసిన శాంటా శిల్పం వరల్డ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ ఇండియాలో కొత్త రికార్డును నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా కూడా సిద్దం చేసినట్లుగా వెల్లడించారు. ఈ కళాకృతిలో ఉపయోగించిన యాపిల్స్ అన్నింటినీ బహుమతులుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి :