సుప్రీంకోర్టులో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

కౌంటింగ్ సిబ్బంది నియామకంపై టీఎంసీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈసీ నిర్ణయం నిబంధనలకు విరుద్ధం కాదని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టులో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : టీఎంసీ అధినేత, బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి సుప్రీంకోర్టులు చుక్కెదురైంది. కౌంటింగ్ సిబ్బంది నియాయకంపై సీఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లుగా సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులను మాత్రమే నియమించడంపై టీఎంసీ అభ్యంతరం చెబుతూ పిటిషన్‌ దాఖలు చేసి…దీనిని అత్యవసరంగా విచారించాలని కోరింది. టీఎంసీ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై టీఎంసీ నేతలు నమ్మకం ఉంచాలని స్పష్టం చేసింది.

ఓట్ల లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల ఉద్యోగులను నియమిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌ నిబంధనలకు విరుద్ధమేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. . లెక్కింపు సిబ్బందిని కేవలం ఒకే వర్గం (కేంద్ర ప్రభుత్వం) నుంచి ఎంచుకునే వెసులుబాటు ఈసీకి ఉందని.. కాబట్టి, ఆ సర్క్యులర్ తప్పు అని చెప్పలేమని స్పష్టంచేసింది. ఏప్రిల్‌ 13 నాటి ఆ సర్క్యులరే అమలవుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఓట్ల లెక్కింపు సమయంలో అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు కూడా ఉంటారని గుర్తు చేసింది. టీఎంసీ పిటిషన్‌పై తదుపరి ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది.

బెంగాల్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల ఉద్యోగులను మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్ ను కలకత్తా హైకోర్టు కొట్టివేయడంతో మమత సుప్రీంకు వెళ్లారు. అక్కడ కూడా అదే సీన్ రీపిట్ కావడంతో టీఎంసీ వర్గాలకు షాక్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి :

కేంద్రం చెప్పినట్లుగానే ఆలర్ట్ మేసేజ్ టోన్ లు
Xiaomi Civi 6 | షావోమీ సివి సిరీస్‌ నుంచి చైనాలో సరికొత్త మొబైల్స్.. ఈసారైనా గ్లోబల్ మార్కెట్‌కు వస్తాయా?