Swati Maliwal | నా వ్యక్తిగత ఫొటోలను లీక్ చేసేందుకు కుట్రలు
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి ఘటన రాజకీయంగా దుమారం రేపుతున్న విషయం విదితమే.
స్వాతి మాలీవాల్ మరోసారి సంచలన ఆరోపణలు
విధాత: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి ఘటన రాజకీయంగా దుమారం రేపుతున్న విషయం విదితమే. బిభవ్ అరెస్ట్ తర్వాత స్వాతి మాలీవాల్, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగున్నది. ఈ నేపథ్యంలో స్వాతి తాజాగా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఫొటోలు లీక్ చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఎక్స్ వేదికగా తెలిపారు.
‘ఆప్ సీనియర్ నేత ఒక నిన్న నాకు కాల్ చేశారు. స్వాతిపై అభ్యంతరకర ఆరోపణలు చేయాలంటూ పార్టీలోని ప్రతి ఒక్కరిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలిపారు. నా వ్యక్తిగత ఫొటోలను లీక్ చేసేందుకు కుట్రలు జరగుతున్నట్లు ఆ నేత చెప్పారు. నాకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారు. నాకు వ్యతిరేకంగా మీడియాలో పోస్ట్‌లు చేసే బాధ్యతను ఇంకొందరికి అప్పగించారు. రిపోర్టర్లను కొట్టి నాపై నకిలీ స్టింగ్ ఆపరేషషన్లు చేయించాలని చూస్తున్నారు’ అని స్వాతి ఆరోపించారు.
‘ నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై కోపం లేదు. నిందితుడు చాలా బలమైన వ్యక్తి. బడా నేతలూ అతనికి భయపడుతారు. ఆయనను ఎదరించి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఇవన్నీ నన్ను బాధించడం లేదు. కానీ ఢిల్లీ మహిళా మంత్రి కూడా నవ్వుతూ నన్ను అవమానిస్తున్నారు. మీరు వేలమంది సైన్యాన్ని దించినా నేను ఒంటరిగా ఎదుర్కొంటాను. ఎందుకంటే నిజం నావైపు ఉన్నది. నా ఆత్మగౌరవం కోసం పోరాటం మొదలుపెట్టా. న్యాయం జరిగే వరకు కొనసాగిస్తా. నేను ఒంటరి కావొచ్చు. ప్రయత్నన్ని మాత్రం వదిలి పెట్టను’ అని స్వాతి రాసుకొచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram