విధాత : రాజరికపు రోజులలోనే కాదు…నేటి కాలంలోనూ భార్యలకు ఖరీదైన కానుకలు అందించే ప్రేమికులు…భర్తల ఉదంతాలు అక్కడక్కడ కొనసాగుతున్నాయి. చరిత్రలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ పట్ల ప్రేమతో ప్రపంచ అద్బుత కట్టడాలలో ఒకటైన పాలరాతి నిర్మాణం తాజ్ మహాల్ ను కట్టించిన సంగతి తెలిసిందే. ముంతాజ్ స్మారకార్థం షాజహాన్ నిర్మించిన తాజ్ మహాల్ ప్రపంచం వ్యాప్తంగా ఏడు వింతలలో ఒకటిగా..ప్రేమ చిహ్నంగా కొనసాగుతుంది. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తి ఆనాటి తాజ్ మహాల్ ను కాకపోయినా…అచ్చం దానిని తలపించే రీతిలో ఓ భవనాన్ని నిర్మించి తన భార్యకు కానుకగా ఇవ్వడం వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సే తన భార్య మంజుషపై ఉన్న ప్రేమను చాటుకుంటూ..తాజ్ మహల్ శైలిలో నిర్మించిన 4BHK మార్బుల్ భవనాన్ని నిర్మించి కానుకగా అందించాడు. 27ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఆమె అందించిన మద్దతుకు కృతజ్ఞతా చిహ్నంగా ఆమె కోసం ప్రత్యేకంగా తాజ్ మహల్ శైలిలో ఇంటిని నిర్మించి అంకితం చేసినట్లుగా చౌక్సే వెల్లడించారు.
2021లో ప్రారంభించిన తాజ్ మహల్ నమూనా 4BHK ఇంటిని మక్రానా మార్బుల్, సహా భారత దేశం నలుమూలల నుండి వచ్చిన కళాకారుల అద్బుత నిర్మాణ నైపుణ్యాలను ఉపయోగించి దాదాపు ₹20 మిలియన్ల వ్యయంతో నిర్మించినట్లుగా పేర్కొన్నాడు. తాజ్ మహల్ తరహా గుంబజ్, సింహద్వారాలు, సమ్మెట్రికల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. వారు నడుపుతున్న పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఈ అద్బుత నివాసంలో తన చిన్ననాటి పాల వ్యాపారం మూలాలను గౌరవించటానికి నేలపై పరిచిన మార్బూల్ లో గేదెల రూపంతో కూడిన కళాకృతిని పొందుపరిచారు. ఈ గేదె చిహ్నం మా మూలాలను, అలాగే మేము ఎప్పుడూ అహంకారం చూపకూడదనే విషయాన్ని మాకు గుర్తుచేస్తుందని చౌక్సే వెల్లడించడం విశేషం.
ఆనంద్ ప్రకాష్ చౌక్సే-మంజుష దంపతుల ప్రేమ చిహ్నం వారికి అన్యోన్య దాంపత్యం..ప్రేమానుబంధానికి నిదర్శనంగా నిలవడమే కాదు..జీవితంలో ఎంత పైకి ఎదిగిన ఒదిగి ఉండాలనే భావనను చాటుతుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తాజ్ మహల్ ఒక సమాధి కావడంతో దాని ప్రతిరూపంతో కూడిన భవన నిర్మాణ కానుక అనుచిత చర్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.
A man from MP gifts a Taj Mahal-style house to his wife 🤯
MAN : “This is our 4BHK house.
This is dedicated to my wife”“She has always stood by me” ♥️
“The buffalo symbol will remind us of our roots and to never be arrogant” 🔥
pic.twitter.com/4WaDDD39JC— News Algebra (@NewsAlgebraIND) April 30, 2026
ఇవి కూడా చదవండి :
స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా వెండి
ఎగ్జిట్ పోల్స్ : బెంగాల్‌లో ఉత్కంఠ, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. ఐదు రాష్ట్రాల్లో మిశ్రమ తీర్పు
