Vandhe Bharat Trian | నేడు పట్టాలపైకి మరో మూడు వందే భారత్ ట్రెయిన్స్.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం..!
Vandhe Bharat Trian : దేశంలో నేడు మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలు సర్వీసులను కేంద్రం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికే మొత్తం 51 వందేభారత్ రైళ్లు పట్టాలెక్కాయి. అవి వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.

Vandhe Bharat Trian : దేశంలో నేడు మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలు సర్వీసులను కేంద్రం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటికే మొత్తం 51 వందేభారత్ రైళ్లు పట్టాలెక్కాయి. అవి వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
సాధారణ రైళ్లల్లో లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటంవల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే ఈ రైళ్ల టికెట్ ధరలు కూడా అధికమే అయినప్పటికీ త్వరితగతిన గమ్యస్థానాలకు చేరడానికి ప్రయాణికులు ఈ రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కొత్తగా మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. అందులో చెన్నై-ఎగ్మూర్ నుంచి నాగర్ కోయిల్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. చెన్నై ఎగ్మూర్-నాగర్ కోయిల్ మధ్య దూరం 724 కిలో మీటర్లు. ఈ దూరాన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది గంటల వ్యవధిలో చేరుకుంటుంది.
ఈ రైలుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే రైల్వే అధికారులు విడుదలచేశారు. తెల్లవారుజామున 5 గంటలకు ఎగ్మూర్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్.. 5:23 నిమిషాలకు తాంబరం చేరుకుంటుంది. మధ్యాహ్నం 1:50 గంటలకు నాగర్ కోయిల్‌కు వెళ్తుంది. అదేరోజు మధ్యాహ్నం 2: 20 గంటలకు మళ్లీ ఎగ్మూర్‌కు తిరుగుముఖం పడుతుందీ రైలు. రాత్రి 11 గంటలకు ఎగ్మూర్‌కు చేరుకుంటుంది.
ఈ రైలుతోపాటే మరో రెండు రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అందులో మధురై- బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఉంది. మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులు తెల్లవారు జామున 5:15 గంటలకు ఈ రైలు మధురై నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1:30 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ నుంచి బయలుదేరి రాత్రి 9:45 గంటలకు మధురై చేరుకుంటుంది.