Pregnant Woman | కడుపులో ఉన్నది మగబిడ్డా..? ఆడబిడ్డా..? తెలుసుకునేందుకు కొడవలితో కడుపు కోసిన భర్త
Pregnant Woman | ఆ దంపతులకు వరుసగా ఐదుగురు అమ్మాయిలు.. భార్య కడుపులో ఉన్నది మగబిడ్డా..? ఆడబిడ్డా..? అని తెలుసుకునేందుకు భర్త దారుణ చర్యకు పాల్పడ్డాడు. ఎనిమిది నెలల గర్భిణి కడుపును కొడవలితో కోసేశాడు. ఈ కేసులో కటకటలాపాలైన భర్తకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.

Pregnant Woman | లక్నో : ఆ దంపతులకు వరుసగా ఐదుగురు అమ్మాయిలు.. భార్య కడుపులో ఉన్నది మగబిడ్డా..? ఆడబిడ్డా..? అని తెలుసుకునేందుకు భర్త దారుణ చర్యకు పాల్పడ్డాడు. ఎనిమిది నెలల గర్భిణి కడుపును కొడవలితో కోసేశాడు. ఈ కేసులో కటకటలాపాలైన భర్తకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ సివిల్ లైన్స్‌కు చెందిన పన్నాలాల్‌కు 22 ఏండ్ల క్రితం అనిత అనే మహిళతో వివాహమైంది. 2020 నాటికి వారికి ఐదుగురు ఆడపిల్లలు జన్మించారు. అయితే ఐదు కాన్పుల్లో ఒక్క మగ పిల్లాడు కూడా పుట్టలేదని పన్నాలాల్ తన భార్యతో గొడవపడేవాడు. 2020 ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఆ ఏడాది సెప్టెంబర్‌లో అనిత ఏడు నెలల గర్భిణి.
అయితే అనిత కడుపులో ఉన్నది ఆడబిడ్డా..? మగబిడ్డా..? అని తెలుసుకునేందుకు పన్నాలాల్ ప్రయత్నించాడు. దీంతో కొడవలితో ఏడు నెలల గర్భిణి కడుపు కోసేశాడు. కడుపులో ఉన్న మగ శిశువు ప్రాణాలు కోల్పోయాడు. అనిత ప్రాణాలతో బయటపడింది.
ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత మగ శిశువు హత్యకు కారణమైన పన్నాలాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరుసగా ఆడబిడ్డలే జన్మించారని, తనకు మగ పిల్లాడు కావాలని వేధించేవాడని ఫిర్యాదులో అనిత పేర్కొంది. విడాకులు ఇస్తే తాను మరో మహిళను పెళ్లి చేసుకుని, మగపిల్లాడికి జన్మనిస్తానని అనేవాడని తెలిపింది. మగపిల్లాడి కోసం చాలా సందర్భాల్లో గొడవలు చేసుకున్నట్లు అనిత పేర్కొంది. ఈ కేసు విచారణ అనంతరం పన్నాలాల్‌కు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.