Uttar Pradesh : ఇక నుంచి రూ.40వేల ఇంజెక్షన్ ఫ్రీ.. గుండెపోటు నుంచి శీఘ్ర రక్షణ
గుండె పోటు రోగులకు ప్రాణరక్షక ఇంజెక్షన్లు ఇకపై యూపీ జిల్లా ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లలో ఉచితం. టెనాక్ట్ ప్లేస్, స్ట్రెప్టోకినేస్ అందుబాటులోకి రానున్నాయి.
శ్రీకారం చుట్టిన యూపీ సర్కార్
ఇక నుంచి జిల్లా ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లలో
గుండె పోటుకు గురైన రోగులను బతికించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఉదార నిర్ణయం తీసుకున్నది. జీవితాన్ని కాపాడే రూ.40వేల విలువైన ఇంజెక్షన్లను ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అందుబాటులో పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది.
టెనాక్ట్ ప్లేస్, స్ట్రెప్టోకినేస్ వంటి ఇంజెక్షన్లు బహిరంగ మార్కెట్ లో రూ.40వేల నుంచి రూ.50వేల మధ్య విక్రయిస్తున్నారు. ఈ రెండు రకాల ఇంజెక్షన్లను అందుబాటు పెట్టాలని అన్ని జిల్లాలకు చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. గుండె పోటు కు గురైన తరువాత ప్రధాన ఆసుపత్రులకు తరలించేందుకు సమయం పడుతుంది. ఈ లోపే (గోల్డెన్ అవర్) ఆలస్యం చేయకుండా ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే ప్రాణాపాయం తప్పుతుంది.
ప్రస్తుతం కేజీఎంయూ, లోహియా ఇనిస్టిట్యూట్, ఎస్.జీ.పీ.జీ.ఐ, బీ.హెచ్.యూ వారణాసి, సైఫాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రయాగ్ రాజ్ ఏఎంయూ, ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజీ లో ప్రస్తుతం రెండు రకాల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి జిల్లా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వైద్య కళాశాలల్లో కూడా అందుబాటులో ఉండనున్నది. స్టాక్ అందుబాటులో ఉండేలా చూడాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్లను వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram