Vande Bharat | ఆ రూట్‌లో ఐదో వందే భారత్‌ రైలును నడిపించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు..!

Vande Bharat | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ నియోజకవర్గం వారణాసికి మరో వందే భారత్‌ రైలును నడిపించబోతున్నది. ఈ కొత్త సెమీ హైస్పీడ్‌ రైలు ఎనిమిదిది కోచ్‌లతో పరుగులు తీయనున్నది. ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

Vande Bharat | ఆ రూట్‌లో ఐదో వందే భారత్‌ రైలును నడిపించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు..!

Vande Bharat | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ నియోజకవర్గం వారణాసికి మరో వందే భారత్‌ రైలును నడిపించబోతున్నది. ఈ కొత్త సెమీ హైస్పీడ్‌ రైలు ఎనిమిదిది కోచ్‌లతో పరుగులు తీయనున్నది. ఈ రైలులో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వారణాసి నుంచి దేశంలోని వివిధ నగరాలకు నాలుగు వందే భారత్‌ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. తాజాగా మరో రైలును సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఆరెంజ్‌ కలర్‌లో ఉన్న వందే భారత్‌ రైలును ఈ సారి నడిపించనున్నారు.

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త వందేభారత్ రైలును నడపాలని యోచిస్తున్నట్లు కాంట్ రైల్వే స్టేషన్ స్టేషన్ డైరెక్టర్ గౌరవ్ దీక్షిత్ తెలిపారు. ప్రయాణించే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు కనెక్టివిటీని మరింత పెంచడం దీని లక్ష్యమని తెలిపారు. వారణాసి వందే భారత్‌ను ఏ రూట్‌లో నడపాలనే విషయంలో స్పష్టత రాలేదని పేర్కొన్నారు. ఈ రైలులో 600 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం నాలుగు రైళ్లు వారణాసికి నడుస్తుండగా.. ఇందులో రెండు ఢిల్లీ రూట్‌ పాట్నాలో, ఒకటి లక్నో రూట్‌, మరొకటి రాంచీ మార్గంలో నడుస్తున్నాయి. ఈ కొత్త వందే భారత్ రైలు వారణాసి నుంచి పాట్నా మీదుగా హౌరా మార్గాన్ని కలుపుతూ నడిపించనున్నట్లు సమాచారం.