విధాత : తమిళనాడు సీఎం సీజే. విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేసిన విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఏదో ఒక స్థానాకికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో …తాజాగా తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి..పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని విజయ్ నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు తిరుచ్చి స్థానానికి విజయ్ రాజీనామా చేశారు. మంత్రులు కె.ఎ.సెంగోట్టయ్యన్, పి.వెంకటరమణలు ఆదివారం సాయంత్రం సచివాలయంలో శాసనసభ కార్యదర్శి కె.శ్రీనివాసన్‌ను కలిసి తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించిన విజయ్ రాజీనామా లేఖను అందజేశారు.
ఆ స్థానంలో త్రిష పోటి చేస్తుందా..?
ఈ స్థానాన్ని మిత్ర పక్షం వీసీకే తమకు కేటాయించాలని పట్టుబట్టింది. అయితే ఆ స్థానాన్ని వీసీకేకు కేటాయిస్తారా లేక టీవీకేనే పోటీ చేస్తుందా అన్న అంశం మునుముందు తేలనుంది. మరోవైపు తిరుచ్చి స్థానంలో నటి త్రిష కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదన్న ప్రచారం సైతం వినిపిస్తుండటం ఆసక్తికరం. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం విజయ్ ముందుగా ఈ నెల 13నాటికి అసెంబ్లీలో తన మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉండటం గమనార్హం.
