విధాత : ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరేందుకు టీవీకే చీప్ విజయ్ ముచ్చటగా మూడోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిసేందుకు సిద్దమయ్యారు. ఈ రోజు సాయంత్రం 4:30కి గవర్నర్ తో విజయ్ మరోసారి భేటీ కాబోతున్నారు. ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్క్ 118 మంది ఎమ్మెల్యే మద్దతును ప్రదర్శించడంతో ఆయనను సంతృప్తి పరుచలేకపోయారు. ఈ సారైనా గవర్నర్ అడిగినట్లు మెజారిటీ మద్దతుదారులను విజయ్ చూపుతారా? లేదా? అన్న ఉత్కంఠ కొనసాగుతుంది.
విజయ్ కి మద్దతుపై వామపక్షాలు, టీవీసీ సై…
అయితే నేటీ సాయంత్రం గవర్నర్ తో జరిగే భేటీకి ముందు విజయ్ మద్దతు కోసం వామపక్షాలు, టీవీసీ పార్టీల నాయకత్వంతో చర్చలు జరిపారు. విజయ్ కి మద్దతునిచ్చేందుకు ఎట్టకేలకు సీపీఐ, సీపీఎం, వీసీకే అంగీకరించాయి. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. టీవీకే 107, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 సీట్లు ఉన్నాయి. వీరందరి మద్దతుతో టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ నంబర్ 118 లభించనుంది. అలాగే ఒక సీటు ఉన్న డీఎండీకే తో కూడా విజయ్ చర్చించారు. దీంతో వారంతా మరికాసేపట్లో టీవీకేకు మద్దతుపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
