సీఎం విజయ్ కి మాజీ సీఎం స్టాలిన్ కౌంటర్

తమిళనాడు కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన టీవీకే చీప్ సీ.జే.విజయ్ కి డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే.స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్న సీఎం విజయ్ ఆరోపణలకు స్టాలిన్ కౌంటర్ కూడా ఇచ్చారు.

విధాత : తమిళనాడు కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన టీవీకే చీప్ సీ.జే.విజయ్ కి డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే.స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్న సీఎం విజయ్ ఆరోపణలకు స్టాలిన్ కౌంటర్ కూడా ఇచ్చారు. “ఖజానాలో డబ్బు ఉంది.. ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం ఉండాలి” అంటూ స్పందించారు. తమిళనాడు అప్పులు అనుమతించిన పరిమితుల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

ప్రభుత్వం వద్ద డబ్బు లేదని సాకులు చెప్పవద్దని,పరిపాలించే దమ్ము, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం ఉంటే అప్పులు అడ్డుకావని మాజీ సీఎం స్టాలిన్ హితవు పలికారు. అధికారం చేపట్టగానే పాత ప్రభుత్వాలపై నిందలు వేయడం మానుకోవాలని సూచించారు. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి సంక్షేమ పథకాలను ఆపవద్దని విజయ్ సర్కార్‌ను హెచ్చరించారు.

“ద్రవిడ సిద్ధాంతానికి ఎన్నడూ ఓటమి లేదు” అని స్పష్టం చేశారు. తమ పార్టీ భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన ఉండి బలమైన ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని బదులిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రతికూలతల మధ్య విజయ్ తన ఎన్నికల హామీలను ఎలా అమలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Latest News