Hit and Run case | వర్లి హిట్ అండ్ రన్ కేసు.. నేరం ఒప్పుకున్న నిందితుడు
Hit and Run case | ముంబైలోని వర్లి హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహిర్ షా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు.. ఆ రోజు ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ సందర్భంగా అతను 'ఇక నా కెరీర్ ముగిసింది' అని ఆవేదన చెందినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.

Hit and Run case : ముంబైలోని వర్లి హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహిర్ షా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు.. ఆ రోజు ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ సందర్భంగా అతను ‘ఇక నా కెరీర్ ముగిసింది’ అని ఆవేదన చెందినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యాక్సిడెంట్ జరిగిన రోజు (జూలై 7న) మిహిర్ షా జుహూ ఏరియాలోని బార్‌లో స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. ఆ తర్వాత మరో బార్‌లో మద్యం సేవించాడు. మెరైన్ డ్రైవ్‌లో జాయ్ రైడ్‌కు వెళ్లాడు. వర్లీ ఏరియాలో స్కూటీని ఢీకొట్టాడు. దాంతో స్కూటీ నడుపుతున్న మహిళ కావేరీ నఖ్వా (45) కారులో ఇరుక్కుపోయింది.
మహిళను ఢీకొట్టి, ఆమె కారులోనే ఇరుక్కుపోయిందని తెలిసినప్పటికీ మిహిర్ కారును ఆపకుండా ముందుకుపోనిచ్చాడు. దారిలో వాహనదారులు ఆరిచినప్పటికీ వినిపించుకోలేదు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అలా 1.5 కిలోమీటర్ల దూరం వెళ్లి కారు ఆపాడు. అక్కడ మహిళ మృతదేహాన్ని కారు నుంచి లాగిపడేసి, డ్రైవర్ సీట్లో రాజ్ రిషి బిదావత్ అనే వ్యక్తిని కూర్చోబెట్టి పారిపోయాడు. ఈ విషయాన్ని మిహిర్ స్వయంగా వెల్లడించాడు.