Rivaba jadeja | జామ్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రివాబా జడేజా.. Video

Rivaba jadeja | భారత స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి, గుజరాత్‌లోని జామ్‌నగర్‌ అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యే రివాబా జడేజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జామ్‌నగర్‌ సిటీలోని పండిట్‌ దీన్‌దయాల్ విద్యాభవన్‌లో ఏర్పాటు చేసిన 112 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్‌ బయటికి వచ్చి తన వేలిపై ఉన్న సిరాగుర్తును చూపించారు. కింది వీడియోలో రివాబా ఓటు వేసిన దృశ్యాలను చూడవచ్చు.

Rivaba jadeja | జామ్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రివాబా జడేజా.. Video

Rivaba jadeja : భారత స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి, గుజరాత్‌లోని జామ్‌నగర్‌ అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యే రివాబా జడేజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జామ్‌నగర్‌ సిటీలోని పండిట్‌ దీన్‌దయాల్ విద్యాభవన్‌లో ఏర్పాటు చేసిన 112 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్‌ బయటికి వచ్చి తన వేలిపై ఉన్న సిరాగుర్తును చూపించారు. కింది వీడియోలో రివాబా ఓటు వేసిన దృశ్యాలను చూడవచ్చు.

జామ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ జేపీ మారవీయను బరిలో నిలుపగా.. బీజేపీ నుంచి పూనంబెన్‌ మాడమ్ పోటీలో ఉన్నారు. కాగా ఏడు విడతల సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ మూడో విడత ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్నది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాల్లో నేడు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా, మరో కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా తదితర ప్రముఖులు ఇవాళ్టి ఎన్నికల బరిలో అభ్యర్థులుగా ఉన్నారు.

ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ ముగిసింది. ఇవాల మూడో విడత పోలింగ్‌ కొనసాగుతున్నది. జూన్ 1 ఏడో విడత పోలింగ్‌తో పోలింగ్‌ ప్రక్రియ ముగియనుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ మరుసటి ఎన్నికల సంఘం ప్రకటనతో సుదీర్ఘ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.