BJP MLA | మీకు ఓటేసినందుకు నాకు పిల్లను చూడండి.. బీజేపీ ఎమ్మెల్యేను కోరిన పెట్రోల్ బంక్ సిబ్బంది..
BJP MLA | ఓట్లు( Votes ) వేసి గెలిపించిన నాయకులను.. తమ గ్రామంలో, పట్టణంలో అభివృద్ధి చేయాలని కోరుతుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం వినూత్న కోరిక కోరాడు. మీకు ఓటేసి గెలిపించినందుకు నాకు పిల్లను( Bride ) చూసి పెళ్లి చేయండని ఓ బీజేపీ ఎమ్మెల్యే( BJP MLA )ను ఓ పెట్రోల్ బంక్ సిబ్బంది( Petrol Bunk attender ) కోరాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని చర్‌ఖరి బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్( MLA Brijbhushan Rajput ).. పెట్రోల్ కోసమని మహోబా వద్ద ఆగాడు. ఇక పెట్రోల్ బంక్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే రాజ్‌పుత్‌ను చూసి.. బంక్ సిబ్బంది ఒకరు అతని వద్దకు వచ్చేశాడు. ఇక అతన్ని చూసిన ఎమ్మెల్యే.. ఏదైనా సాయం అడుగుతాడని ఊహించాడు. కానీ అతను అడిగింది విని ఎమ్మెల్యే షాకయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఓటేసి.. మీ గెలుపునకు కృషి చేశాను. నాకో పిల్లను చూసి పెళ్లి చేయండి అని ఎమ్మెల్యేను అభ్యర్థించాడు.
షాక్‌లో నుంచి తేరుకున్న ఎమ్మెల్యే.. నీ వయసెంత అని అఖిలేంద్ర ఖరేని అడిగాడు. తన వయసు 44 ఏండ్లు చెప్పేసరికి మరింత షాక్ అయ్యారు. మరి నన్నే ఎందుకు అడుగుతున్నావ్.. పిల్లను చూడమని..! ఎమ్మెల్యే అడిగేసరికి.. నీకు ఓటేసినందుకు అని ఖరే క్షణాల్లో సమాధానం ఇచ్చాడు. ఇక తన జీతం నెలకు రూ. 6 వేలు.. 13 బిగాల ల్యాండ్ ఉందని చెప్పాడు. కచ్చితంగా నీకు పిల్లను చూసి పెళ్లి చేసే బాధ్యత తనదే అని ఎమ్మెల్యే రాజ్‌పుత్ అఖిలేంద్ర ఖరేకు హామీ ఇచ్చాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.