- ఐదు రాష్ట్రాల్లో 824 సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు
- అత్యధికంగా టీఎంసీ, కాంగ్రెస్, ముస్లిం లీగ్ నుంచే
- ఒక్క టికెట్ కూడా ఇవ్వని బీజేపీ
విధాత, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా 104 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా 38, ఆ తరువాత కేరళలో 34 మంది, అసోం లో 22 మంది. తమిళనాడులో 9 మంది, పుదుచ్చేరిలో ఒకరు చొపున గెలుపొందారు.
మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ముస్లిం ఎమ్మెల్యేలు 12.62 శాతం ఉన్నారు. తమిళనాడులో ముస్లింలు అధికంగా ఉన్నప్పటికీ ఆ మేరకు ఎన్నిక కాలేదు. అయితే నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏ ఒక్క చోట కూడా ముస్లిం అభ్యర్థికి బీజేపీ టికెట్ కేటాయించలేదు. ఎక్కువగా టీఎంసీ, కాంగ్రెస్, ముస్లిం లీగ్ పార్టీల నుంచి ఎన్నిక కాగా స్వల్పంగా కమ్యూనిస్టులు, డీఎంకే, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి గెలుపొందారు.
కొట్టక్కల్ ఆయుర్వేదం, మసాజ్ కు ప్రముఖ ప్రాంతంగా గుర్తింపు పొందింది. గురువాయుర్ లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నారు, వాయనాడ్ కు దగ్గరగా ఉంటుంది. ఈ నియోజకవర్గం లో ప్రసిద్ధ శ్రీకృష్ణ దేవాలయం ఉంది. అయ్యప్ప దేవాలయానికి వచ్చే భక్తుల కన్నా ఎక్కువగా భక్తులు వస్తుంటారు. అయినప్పటీకీ ఈ నియజకవర్గాల నుంచి ముస్లిం అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. తమిళనాడు లోని చిదంబరం నటరాజ స్వామి ఆలయం ఉంది. మధురై లో మీనాక్షీ అమ్మవారి ఆలయం ఉంది. తిరునల్వేలి జిల్లాలోని పాపనాశం పట్టణం ఉంది. తామ్రపర్ణ నది ఒడ్డున పాపనాశస్వామి ఆలయం వెలిసింది. బ్రహ్మ పురాణం ప్రకారం ఇక్కడ స్నానమాచరించడం హిందువులకు పరమ పవిత్రమైనది. ఈ నియోజకర్గాల్లో కూడా ముస్లిం అభ్యర్థులే గెలుపొందారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో ముస్లింలు 27.01 శాతం వరకు ఉన్నారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పాటు టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం అభ్యర్థులకు ఎక్కువ స్థానాలను ఇస్తూ వస్తున్నాయి. 293 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగ్గా 38 మంది ముస్లిం అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేశారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ 80 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను బరిలో నిలపగా, 32 మంది గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఏజేయూపీ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు, ఏఐఎస్ఎఫ్ పార్టీల నుంచి ఒకరు చొప్పున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గెలిచిన అభ్యర్థి నియోజకవర్గం పార్టీ పేరు
హమీదుల్ రహ్మాన్ – చోప్రా- టీఎంసీ
ఎండీ గులాం రబ్బానీ- గోల్ పోకర్- టీఎంసీ
ఆజాద్ మిన్హజుల్ అర్ఫీన్ -చాకులియా -టీఎంసీ
మోసరాఫ్ హుస్సేన్- ఇటాహర్- టీఎంసీ
తోరఫ్ హోస్సేన్ మండల్ -కుమార్ గంజ్ -టీఎంసీ
ఎండీ మతిబుర్ రహ్మాన్ -హరీశ్ చంద్రపూర్-టీఎంసీ
అబ్దుర్ రహీం బోక్సీ- మాలతిపూర్- టీఎంసీ
ఇస్లాం ఎండీ నజ్రుల్- మోతబరీ- టీఎంసీ
సబీనా యాస్మీన్ -సుజాపూర్ -టీఎంసీ
మొహ్మద్ నూర్ అలం- శంషేర్ గంజ్ -టీఎంసీ
అఖ్రుజ్జమాన్ -రఘునాథ్ గంజ్- టీఎంసీ
ముస్తాఫిజుర్ రహ్మాన్- భరత్ పూర్- టీఎంసీ
నియమోత్ షేక్ -హరిహరపారా- టీఎంసీ
బాబర్ అలీ -జలంగీ -టీఎంసీ
రుక్బానుర్ రహ్మాన్ -పలశిపారా- టీఎంసీ
అలీఫా అహ్మద్- కాళీగంజ్- టీఎంసీ
జేబర్ షేక్- చాప్రా -టీఎంసీ
బెర్హూనుల్ ముఖద్దీన్- బాదురియా -టీఎంసీ
మహ్మద్ ఖాసీం సిద్దిఖీ- అమ్దంగా- టీఎంసీ
అనీసుర్ రహ్మాన్ బిదేశ్ దేగంగా టీఎంసీ
అబ్దుల్ మతీన్ ముహ్మద్- హరోవా- టీఎంసీ
ఎండీ తౌసిఫుర్ రహ్మాన్ -బసిరాహత్ఉత్తర్- టీఎంసీ
ఎండీ బహరుల్ ఇస్లాం- కన్నింగ్ పుర్బా- టీఎంసీ
ఎండీ షమీమ్ అహ్మద్ మొల్ల -మగ్రహత్ పశ్చిమ్- టీఎంసీ
అహ్మద్ జావేద్ ఖాన్- కస్బా- టీఎంసీ
అబ్దుల్ కాలేఖ్ మొల్ల -మెటియాబురుజు -టీఎంసీ
ఫిర్హాద్ హకీం -కొలకత్తా ఫోర్ట్ -టీఎంసీ
ఫయెజుల్ హఖ్- హన్సం- టీఎంసీ
మోసరఫ్ హుస్సేన్ -మురరాయ్- టీఎంసీ
అబ్దుల్ అజీజ్ -లాల్ గోలా -టీఎంసీ
రేయత్ హొస్సేన్ సర్కార్- భగవాన్ గోలా- టీఎంసీ
గుల్షన్ ముల్లిక్ -పంచలా- టీఎంసీ
మొతాబ్ షేక్- ఫరక్కా- కాంగ్రెస్
జుల్ఫికర్ అలీ -రాణినగర్- కాంగ్రెస్
హుమాయున్ కబీర్- రేజీనగర్ -ఏజేయూపీ
ఎండీ మోస్తఫిజుర్ రహ్మాన్- డోమ్కల్- సీపీఎం
ఎండీ నవ్సాద్ సిద్దిఖీ -భాంగర్- ఏఐఎస్ఎఫ్
అసోంలో కాంగ్రెస్ నుంచి 18 మంది విజయం…
అసోంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది ముస్లిం లు ఉన్నారు. ఈ పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే నౌ బొగా నియోజకవర్గం నుంచి డాక్టర్ జాయ్ ప్రకాశ్ దాస్ గెలుపొందడం విశేషం. ఏఐయూడీఎఫ్ నుంచి ఇద్దరు, రాజోర్ దళ్ నుంచి ఒకరు, టీఎంసీ నుంచి ఒకరు చొప్పున విజయం సాధించారు.
గెలిచిన అభ్యర్థి నియోజకవర్గం పార్టీ పేరు
ఎండీ అష్రఫుల్ ఇస్లాం షేక్ పర్బతిజోరా కాంగ్రెస్
అబ్దస్ సొబహన్ అలీ సర్కార్ గౌరిపూర్ కాంగ్రెస్
బేబీ బేగం డుబ్రీ కాంగ్రెస్
వాజేద్ అలీ చౌధురీ బిర్సింగ్ జరువా కాంగ్రెస్
మొహిబుర్ రోహ్మనా మంకచ్చర్ కాంగ్రెస్
అఫ్తాబ్ ఉద్దీన్ మొల్లాహ జలేశ్వర్ కాంగ్రెస్
అబ్దుల్ కలం రషీద్ అలం గోల్ పారా ఈస్ట్ కాంగ్రెస్
ఎండీ నురుల్ ఇస్లాం శ్రీజంగ్రామ్ కాంగ్రెస్
అబ్దుర్ రహీం అహ్మద్ చెంగా కాంగ్రెస్
జాకీర్ హుస్సేన్ సిక్దర్ పాకా బేట్ బారీ కాంగ్రెస్
రెకీబుద్దీన్ అహ్మద్ చమారియా కాంగ్రెస్
ఆసిఫ్ మొహమ్మద్ నజర్ లహరీ ఘాట్ కాంగ్రెస్
నురుల్ హుడా రుపాహిహట్ కాంగ్రెస్
టంజిల్ హుస్సేన్ సామగురి కాంగ్రెస్
అమీనుల్ హక్ సొనాయి కాంగ్రెస్
జుబేర్ ఆనం మజుందార్ కరీంగంజ్ నార్త్ కాంగ్రెస్
అమీనుర్ రషీద్ ఛౌధురి కరీంగంజ్ సౌత్ కాంగ్రెస్
మజిబుర్ రహ్మాన్ దల్గాం ఏఐయూడీఎఫ్
మహ్మద్ బద్రూద్దీన్ అజ్మల్ బిన్నకంది ఏఐయూడీఎఫ్
మెహబూబ్ ముక్తార్ ధింగ్ రాయిజోర్ దళ్
షెర్మన్ అలీ అహ్మద్ మండియా టీఎంసీ
కేరళలో ముస్లిం లీగ్ నుంచే 22 మంది…
కేరళం రాష్ట్రంలో ఎల్డీఎప్ ఓటమీ పాలు కాగా యూడీఎఫ్ అత్యధిక సీట్లను కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది, ముస్లిం లీగ్ నుంచి 22 మంది, సీపీఎం నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒకరు విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ముస్లింల జనాభా 26.56 శాతం ఉంది.
గెలిచిన అభ్యర్థి నియోజకవర్గం పార్టీ పేరు
టీ సిద్దిఖీ కాల్ పెట్ట కాంగ్రెస్
ఆర్యదాన్ షౌకత్ నీలంబూర్ కాంగ్రెస్
కేపీ నౌషాద్ అలీ పొన్ననీ కాంగ్రెస్
మహ్మద్ షియాస్ కొచ్చి కాంగ్రెస్
ఎఫ్.రాజా దేవికులం కాంగ్రెస్
షనిమోల్ ఉస్మాన్ ఆరూర్ కాంగ్రెస్
ఎంఎం నసీర్ చదయమంగళం కాంగ్రెస్
ముహ్మద్ సుధీర్ షా వామనపురం కాంగ్రెస్
ఏకేఎం అష్రాఫ్ మంజేశ్వర్ ముస్లిం లీగ్
కల్లత్రా మహిన్ కాసర్ గడ్ ముస్లిం లీగ్
పరక్కల్ అబ్దుల్ కుట్టియాడి ముస్లిం లీగ్
ఫాతిమా తాహిల్యా పెరంబ్ర ముస్లిం లీగ్
ఫైజల్ బాబు కొజిక్కోడ్ సౌత్ ముస్లిం లీగ్
రజాక్ మాస్ర్ కున్న మంగళం ముస్లిం లీగ్
పీకే ఫైరోస్ కొడువల్లి ముస్లిం లీగ్
సీకే కాసీం తిరువాంబది ముస్లిం లీగ్
టీపీ అష్రాఫ్ అలీ కొండొట్టి ముస్లిం లీగ్
పీకే బషీర్ ఎర్నాడ్ ముస్లిం లీగ్
ఎం.రహ్మతుల్లా మంజేరీ ముస్లి లీగ్
నజీబ్ కాంతాపురం పెరింతల్ మన్నా ముస్లిం లీగ్
పీకే కున్హాల్ కుట్టి మాలప్పురం ముస్లిం లీగ్
కేఎం షాజీ వెంగర ముస్లిం లీగ్
టీవీ ఇబ్రహీం వల్లికున్ను ముస్లిం లీగ్
పీఎంఏ షమీర్ తిరురంగడి ముస్లిం లీగ్
పీకే నవాస్ తనూర్ ముస్లిం లీగ్
అబీద్ హుస్సేన్ తంగల్ కొట్టక్కల్ ముస్లిం లీగ్
ఎన్.షంషూద్దీన్ మన్నార్కడ్ ముస్లిం లీగ్
వీఈ అబ్దుల్ గఫూర్ కలమ్ సెరి ముస్లిం లీగ్
మొహ్మద్ రియాస్ బెపోర్ సీపీఎం
ఎసీ మొయిదీన్ కున్నాకులం సీపీఎం
ఎన్.కే.అక్బర్ గురువాయూర్ సీపీఎం
ముహ్మద్ ముహస్సీన్ పట్టంబి సీపీఐ
తమిళనాడు లో తక్కువగా ఎన్నిక…
తమిళనాడు రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించగా ఏడుగురు ముస్లిం అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి గెలుపొందారు. ఈ రాష్ట్రంలో ముస్లిం జనాభా 5.86 శాతం వరకు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఎన్నిక కాలేకపోయారు. డీఎంకే నుంచి ముగ్గురు, టీవీకే నుంచి ముగ్గురు, ముస్లిం లీగ్ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు చొప్పున గెలుపొందారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ముస్లింల జనాభా 6 శాతం వరకు ఉండగా ఒక్కరు మాత్రమే డీఎంకే అభ్యర్థి కారైకల్ సౌత్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం విశేషం.
గెలిచిన అభ్యర్థి నియోజకవర్గం పార్టీ పేరు
తాహిరా రాణిపేట్ టీవీకే
మొహ్మద్ ఫర్వాస్ ఆరంతంగి టీవీకే
మధార్ బధురుద్దీన్ మధురై సెంట్రల్ టీవీకే
తమీమున్ అన్సారీ చిదంబరం డీఎంకే
ఎంహెచ్ జవహరిఉల్లా నాగపట్నం డీఎంకే
ఎం అబ్దుల్ వాహబ్ పాలయం కొట్టాయ్ డీఎంకే
సయ్యద్ ఫరూఖ్ భాషా వనియంబాడి ముస్లిం లీగ్
ఏఎం షాజహాన్ పాపనాశం ముస్లిం లీగ్
జమాల్ మొహమ్మద్ యూనూస్ మయిలాదుత్తరై కాంగ్రెస్
ఏఎంహెచ్ నజీమ్ కారైకల్ సౌత్ డీఎంకే
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం అసెంబ్లీ సీట్లు, విజయం సాధించిన ముస్లిం ఎమ్మెల్యేల వివరాలు ఇవే…
రాష్ట్రం పేరు మొత్తం అసెంబ్లీ సీట్లు గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్- 294 38
కేరళం -140 34
అసోం -126 22
తమిళనాడు- 234 9
పుదుచ్చేరి -30 1
—————————————————–
మొత్తం= 824 104
