30 నుంచి ఎంసెట్ ప్రవేశాలు
విధాత:రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఈసెట్, ఎంసెట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించారు. దాని ప్రకారం ఈ నెల 24 నుంచి ఈసెట్, 30వ తేదీ నుంచి ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కానుంది. వచ్చే నెల (సెప్టెంబరు) 15న విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. ఈ అడ్మిషన్లకు సంబంధించి మంగళవారం ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైౖర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో […]

విధాత:రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఈసెట్, ఎంసెట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించారు. దాని ప్రకారం ఈ నెల 24 నుంచి ఈసెట్, 30వ తేదీ నుంచి ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కానుంది. వచ్చే నెల (సెప్టెంబరు) 15న విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. ఈ అడ్మిషన్లకు సంబంధించి మంగళవారం ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైౖర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌లతో పాటు ఉన్నత విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అనంతరం ఈసెట్, ఎంసెట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించారు. దీని ప్రకారం ఈ నెల 24 నుంచి ఈసెట్, 30 నుంచి ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. ఈసెట్ అడ్మిషన్లకు సంబంధించి ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించనున్నారు. వచ్చే నెల 2న ఈసెట్‌కు సంబంధించిన సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 7లోగా అందులో చేరాల్సి ఉంటుంది. సెప్టెంబరు 13 నుంచి రెండో దశ, తుది దశ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టనున్నారు.
ఎంసెట్ అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 30 నుంచి వచ్చే నెల 9 వరకు స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఇస్తారు. వచ్చే నెల 4నుంచి 11వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 4 నుంచి 13వ తేదీ వరకు అభ్యర్థులు తమ ఆప్షన్లను పెట్టుకోవాలి. సెప్టెంబరు 15న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. మిగిలిపోయిన సీట్ల భర్తీకి తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నారు. కాగా, ప్రవేశ పరీక్షలు ముగిసినందున ఈ నెల 18న ఈసెట్, 25న ఎంసెట్ (ఇంజనీరింగ్) ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించి, అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. 12నాటికి అభ్యర్థులు ఆప్షన్లను పెట్టుకోవాల్సి ఉంది. 14న సీట్లను కేటాయిస్తారు.