Viral | రైలు కిటికీ నుంచి చోరీ చేయ‌బోయాడు.. ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు!

  • By: sr    news    Apr 09, 2025 3:53 PM IST
Viral | రైలు కిటికీ నుంచి చోరీ చేయ‌బోయాడు.. ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు!

విధాత: రైలులో సెల్ ఫోన్ చోరీకి ప్రయత్నించే క్రమంలో పట్టుబడిన దొంగకు ప్రయాణికులు చావు భయాన్ని రుచి చూపించారు. బీహార్ లోని భాగల్‌పూర్ సమీపంలో కదులుతున్న రైలులో ఓ ప్రయాణికుడి ఫోన్‌ను దొంగ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే తేరుకున్న ప్రయాణికుడు దొంగను పట్టుకున్నాడు. పారిపోతున్న దొంగను పట్టుకునే క్రమంలో అతడు బోగీకి వేలాడే స్థితిలో పట్టుబడ్డాడు. ప్రయాణికులు అతడిని అలాగే గట్టి పట్టుకుని కిలోమీటర్ వరకు వేలాడదీశారు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సమీప స్టేషన్ కు ముందు రైలు వేగం తగ్గగానే పరుగున వచ్చి అతడిని పట్టుకున్నారు. దీంతో దొంగకు ప్రాణాపాయం తప్పినప్పటికి పోలీసులకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. అయితే రైలు బోగీకి వేలాడిన సయయంలో దొంగ ఎలాంటి ప్రమాదానికి గురికాకపోవడంతో అతనికి ఇంకా భూమి మీద నూకలున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.