న్యూడ్ సీన్లకు హీరోయిన్ గ్రీన్ సిగ్నల్.. ఫొటో షూట్! వద్దనుకున్న డైరెక్టర్

విధాత: కథానాయికగా, గాయనిగా రెండు పడవల ప్రయాణం చేస్తూ దూసుకుపోతుంది మల్టి టాలెంటెడ్ అండ్రియా జర్మియా (Andrea Jeremiah). రాఖీ రాఖీ అంటూ పాటతో తెలుగులో మంచి గుర్తింపునే తెచ్చుకున్నఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రధాన పాత్రలు పోషిస్తోంది. పెక్యులర్ అండ్ సెక్సీ వాయిస్‌తో ఆండ్రియా పాడిన పాటలు తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేయగా ప్రత్యేకంగా కన్సర్ట్‌లు కూడా చేస్తోంది.
మహేశ్ బాబు భరత్ అనే నేను చిత్రంలోనూ ఓ పాట కూడా పాడడం విశేషం. అయితే తన వాయిస్‌ను మించిన ఆకర్షణ తన లుక్స్‌లోనూ మెండుగా ఉండడంతో ఆండ్రియా నటిగా కూడా పేరు తెచ్చుకొంది. కార్తీ యుగానికి ఒక్కడు, సిద్ధార్థ్ గృహం సినిమాలతో యూత్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఈ మధ్య అమ్మడికి అవకాశాలు అశించినంతగా లేకపోవడంతో సినిమాల సంఖ్య తగ్గింది. ఒకటి రెండు చిత్రాలలో మాత్రమే నటిస్తోంది. వీటిలో గతంలో మిస్కిన్ (Mysskin) దర్శకత్వంలో ‘పిసాసు-2’ (పిశాచి 2) (Pisaasu II) చిత్రంలో కీలక పాత్రలో ఓ సినిమా ప్రారంభమై షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఇప్పటికీ విడుదల కావడానికి మల్లగుల్లాలు పడుతోంది.
అయితే ఈ సినిమా గురించి ఓ కార్యక్రమంలో దర్శకుడు మిస్కిన్ మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మూవీలో కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించేదుకు ఆండ్రియా అంగీకరించినట్లు తెలిపాడు. కథకు అవసరమని ఆమె ఆ రిస్క్ చేయడానికి సైతం రెడీ అయిందని అన్నాడు.
Madhavan: కొత్త కాంట్రవర్సీ.. ఆ సినిమాలు చివరిదాకా చూడలేకపోయా
ఇందుకు సంబంధించి ఓ లేడీ ఫొటోగ్రాఫర్‌తో ఒక ఫొటో షూట్ కూడా చేశామని తెలిపారు. కానీ ప్రస్తుతం యూత్ ఆ సన్నివేశాలను చూసే కోణం మారిందని, అందుకే బాగా ఆలోచించి నిర్ణయాన్ని మార్చుకున్నా అని వివరించారు. ఆ తర్వాత ఆ సన్నివేశాలను కెమెరా టెక్నిక్స్ ఉపయోగించి మరోలా తీశానని అన్నారు.
నేను కనుక ఆండ్రియాతో ఆ సీన్స్ చేసి ఉంటే సినిమాకు మంచి బజ్ వచ్చి ఈ పాటికే రిలీజ్ కూడా అయ్యేదని మిస్కిన్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మిస్కిన్ (Mysskin) మాటల్ని బట్టి చూస్తుంటే సినిమాకు బిజినెస్ జరగక విడుదలకు కాలేదేమో అని అనుకొంటున్నారు.
మీకో దండంరా నాయనా.. కొత్త ఊరిని సృష్టించి ప్రభుత్వ డబ్బులు కాజేశారు