All Party Meeting | నేడు ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై చర్చ
All Party Meeting | విధాత: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18నుండి 22వరకు నిర్వహించనున్న నేపధ్యంలో ఒక రోజు ముందుగా కేంద్ర ప్రభుత్వం నేడు ఆదివారం అఖిల పక్ష పార్టీల సమావేశం నిర్వహించనుంది. కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండా ఏమిటన్నదానిపై గోప్యత పాటిస్తుండటంతో ఆదివారం జరిగే అఖిల పక్ష సమావేశం వాడివేడిగా సాగనుందని భావిస్తున్నారు. ఇప్పటికే సోనియాగాంధీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా వెల్లడించాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక […]

All Party Meeting |
విధాత: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18నుండి 22వరకు నిర్వహించనున్న నేపధ్యంలో ఒక రోజు ముందుగా కేంద్ర ప్రభుత్వం నేడు ఆదివారం అఖిల పక్ష పార్టీల సమావేశం నిర్వహించనుంది. కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండా ఏమిటన్నదానిపై గోప్యత పాటిస్తుండటంతో ఆదివారం జరిగే అఖిల పక్ష సమావేశం వాడివేడిగా సాగనుందని భావిస్తున్నారు.
ఇప్పటికే సోనియాగాంధీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా వెల్లడించాలంటూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈనెల 18న మొదలై వినాయక చవితి సందర్భంగా 19వ తేదీన కొత్త పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాలోకి మారనున్నాయి. వినాయక చవితి రోజున పార్లమెంటు సమావేశాలు ఏమిటంటూ ఇప్పటికే శివసేన, ఎన్సీపీలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇండియా పేరు భారత్‌గా మార్పు, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా రిజర్వేషన్ సహా పలు కీలక బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టవచ్చని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ సమావేశాల్లో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం, చైనా అంశం, జమ్మూ కాశ్మీర్‌లో పెరిగిన ఉగ్ర దాడులు, మణిపూర్ సమస్య, నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తాలని ప్రయత్నిస్తున్నాయి.