Robinhood: పుష్ప2 ఎఫెక్ట్.. రాబిన్ హుడ్‌కు తప్పని తిప్పలు

Robinhood
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్ (Robinhood). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 20 న రిలీజ్ కావాల్సిన ఈమూవీని వాయిదా వేసి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు చాలా మంది మూవీ విడుదల కోసం ఎదురుచూస్తూ ఉన్న క్రమంలో సినిమాను మరోమారు పోస్ట్‌పోన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నిర్మాణ సంస్థ నుంచే వచ్చిన పుష్ఫ2 భారీ కలెక్షన్లతో దూసుకెళుతుండడంతో వాటికి ఆలంకం కలగకుండా ఉండేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు అల్లరి నరేష్ బచ్చల మల్లి, విజయ్ సేతుపతి విడుదల2, ఉపేంద్ర యుఐ, మరికొన్ని చిత్రాలు కూడా విడుదల కానుండడంతో రాబిన్ హుడ్‌ను మరో మంచి డేట్ చూసుకుని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. కాగా జనవరిలోనూ పెద్ద సినిమాలు చాలానే రరిలీజ్ కానుండడంతో ఈ మూవీ విడుదల ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.
పుష్ప2 ఎఫెక్ట్..
ఇదిలాఉండగా.. పై చిత్రాల విడుదలకు తోడు ఈ నిర్మాతలు నిర్మించిన పుష్ప2 (Pushpa 2) సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు కొల్లగొడుతుండడంతో దానిని డిస్ట్రబ్ చేయలేక ఇప్పుడు నితిన్ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు టాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను సంక్రాతి బరిలోకి తీసుకువస్తున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పటికే సంక్రాంతికి బాలకృష్ణ డాకూ మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాల విడుదల ఉండడంతో రాబిన్ హుడ్ (Robinhood) చిత్రం రిలీజ్ గగనమే అనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాను ఫిభ్రవరిలో విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా సినిమాను డిసెంబర్25న విడుదల చేయట్లేదు కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామంటూ మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు.