AP Assembly | మీసం తిప్పిన బాలయ్య.. వాడివేడిగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly చంద్రబాబుకు మద్దతుగా సభలో టిడిపి సభ్యుల ఆందోళన! విధాత‌: చంద్రబాబు అరెస్టును అక్రమంగా పేర్కొంటూ ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు టిడిపి అన్నీ అవకాశాలనూ వినియోగిస్తుంది. గ్రామాల్లో ర్యాలీలు..ధర్నాలు..టివి ఛానెల్లో చర్చలు..ఇవన్నీ అయ్యాక ఇప్పుడు బాబు అరెస్ట్ అసెంబ్లీలో చర్చకు దారితీసింది. తమ నాయకుడిని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేశారని ప్రజలకు చెప్పేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలను టిడిపి వినియోగించుకుంటుంది. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటన రాగానే జైల్లో ములాఖాత్ కు వెళ్ళిన […]

  • By: Somu    news    Sep 21, 2023 7:31 AM IST
AP Assembly | మీసం తిప్పిన బాలయ్య.. వాడివేడిగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly

  • చంద్రబాబుకు మద్దతుగా సభలో టిడిపి సభ్యుల ఆందోళన!

విధాత‌: చంద్రబాబు అరెస్టును అక్రమంగా పేర్కొంటూ ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు టిడిపి అన్నీ అవకాశాలనూ వినియోగిస్తుంది. గ్రామాల్లో ర్యాలీలు..ధర్నాలు..టివి ఛానెల్లో చర్చలు..ఇవన్నీ అయ్యాక ఇప్పుడు బాబు అరెస్ట్ అసెంబ్లీలో చర్చకు దారితీసింది. తమ నాయకుడిని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేశారని ప్రజలకు చెప్పేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలను టిడిపి వినియోగించుకుంటుంది.

అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ప్రకటన రాగానే జైల్లో ములాఖాత్ కు వెళ్ళిన బాలయ్య, యనమల వంటివారికి సభలో ఎలా వ్యవహరించాలన్నాది చేయాలన్నది బాబు డైరెక్షన్ ఇచ్చారు. ఇంకా లోకేష్ సైతం ఢిల్లీ నుంచి తమ శాసన సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారు.ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి ? ఏమేం చేస్తే మంచి ప్రచారం వస్తుంది. ప్రజల అటెన్షన్ ఎలా పొందొచ్చన్నది ప్లాన్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే బాలయ్య బాబు అసెంబ్లీలో తొడగొట్టి..మీసం తిప్పి హంగామా చేశారు. చంద్రబాబు మీద పెట్టిన కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు అయినా సరే అధినేత ప్రాపకం కోసం తప్పని ప్రయత్నం. మొన్ననే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి బహిష్కృత మైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా పోడియం మీదకు ఎక్కి పేపర్లు లాగేసి.. మానిటర్ సైతం లాక్కునేందుకు యత్నించారు.

దీనికి ప్రతిగా వైసిపి నుంచి కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. మంత్రి అంబటి రాంబాబు..ఆర్థిక మంత్రి రాజేంద్ర నాథ్ రెడ్డి సైతం ఎదురుదాడి చేశారు. అంబటి సైతం తొడగొట్టి టిడిపి సభ్యులను రెచ్చగొట్టారు. అంబటి సైతం తొడగొట్టి సవాల్ చేశారు. మొత్తానికి సభా సమావేశాలు వేడి వేడిగా మొదలయ్యాయి. అయుతే సభలో బాలకృష్ఱ ప్రవర్తనకు సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.