Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు ఏపీ వాసుల దుర్మరణం

Road Accident: విధాత, అమరావతి: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. చనిపోయినవారంతా ఏపీలోని చిత్తురూ జిల్లా గంగాధర నెల్లూరు వాసులు.
చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో మూడు నెలల చిన్నారి కూడా ఉండటం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డట్టు తెలుస్తున్నది. బాధిత కుటుంబాలకు మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ తీవ్ర సంతాపం తెలిపారు.
ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!