ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా అతుల్‌ ప్రణయ్‌

విధాత‌: ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా అతుల్‌ ప్రణయ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రాంతీయ ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఐఆర్‌ఎస్‌ అధికారి అతుల్‌ ప్రణయ్‌ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన అతుల్‌ వివిధ ప్రాంతాల్లోని పన్ను మదింపు, టీడీఎస్‌, అప్పీల్స్‌ వంటి విభాగాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌లో చాలాకాలం పాటు పని చేసి పలు సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో పన్ను […]

  • Publish Date - July 19, 2021 / 10:07 AM IST

విధాత‌: ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా అతుల్‌ ప్రణయ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రాంతీయ ఆదాయ పన్ను ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఐఆర్‌ఎస్‌ అధికారి అతుల్‌ ప్రణయ్‌ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన అతుల్‌ వివిధ ప్రాంతాల్లోని పన్ను మదింపు, టీడీఎస్‌, అప్పీల్స్‌ వంటి విభాగాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌లో చాలాకాలం పాటు పని చేసి పలు సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతలను పట్టుకోవడంలో సఫలీకృతమయ్యారు.