Daaku Maharaaj: ద‌బిడి దిబిడే.. డాకు మ‌హారాజ్‌

  • By: sr    news    Jan 02, 2025 6:03 PM IST
Daaku Maharaaj: ద‌బిడి దిబిడే.. డాకు మ‌హారాజ్‌

విధాత‌: న‌ట‌స‌సింహం బాల‌కృష్ణ‌, బాబీ క‌ల‌యుక‌ల‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న చిత్రం డాకు మ‌హారాజ్‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోండ‌గా సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 12న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు వేగం చేశారు.

సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసామని , చిరంజీవి అభిమానులు తిట్టుకున్నా పర్లేదు.. వాల్తేరు వీరయ్య కంటే డాకు మహారాజ్ మూవీ బాగా వచ్చిందని, చిరంజీవి అభిమాని అయిన బాబీ బాల‌య్య సినిమాను ఓ రేంజ్‌లో తీశాడ‌ని ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు నిర్మాత నాగ‌వంశీ మీడియా స‌మావేశంలో వెళ్ల‌డించారు.

అయితే.. ఈ సినిమాకు సంబంధించి మేక‌ర్స్‌ మూడు గ్రాండ్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. మొద‌ట‌గా జనవరి 2, గురువారం రోజున సినిమా నుంచి ద‌బిడి దిబిడి అంటూ సాగే ఊర మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఇదే రోజున‌ హైదరాబాదులో ట్రైలర్ రిలీజ్ చేయాల్సి ఉండ‌గా దాన్ని కాస్తా జనవరి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వాయిదా వేశారు. అదే విధంగా చివ‌ర‌గా జనవరి 8న ఆంధ్రప్రదేశ్ విజయవాడ లేదా మంగళగిరిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక తాజాగా విడుద‌ల చేసిన పాట యూత్‌ను కొంత‌కాలం షేక్ చేసేలా ఉంది, అదేవిధంగా స్టెప్పులు మ‌రో రేంజ్‌లో ఉన్నాయి.