Basavaraju Saraiah | BRS హయాంలోనే.. ఆజంజాహి కార్మిక స్థలం కబ్జా

- కార్పొరేషన్ ద్వారా కాగితాలు సృష్టించిందే మీరు
- మాజీ ఎమ్మెల్యే నరేందర్ పై ఆగ్రహం
- గత, ప్రస్తుత ఎమ్మెల్యేలు కుమ్మక్కయ్యారా?
- మాజీమంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
విధాత, వరంగల్: ఆజం జాహి మిల్లు స్థలం కబ్జా పై ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్పందించడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎద్దేవా చేశారు.. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆజాంజాహి మిల్లు స్థలం కబ్జాపై మాట్లాడుతున్న తీరును తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే ఆజంజాహి మిల్లు కార్మిక భవన్ కబ్జా పురుడు పోసుకుందన్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ సారయ్య సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ పదేళ్ల పాలనలో ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాకు గురికాబడ్డాయని మండిపడ్డారు.
మున్సిపల్ కార్పొరేషన్ ను అదుపులో ఉంచుకొని ఇష్టం వచ్చినట్లుగా దొంగ కాగితాలను సృష్టించింది ఎవరు..? అంటూ నిలదీశారు. గత పది సంవత్సరాల పరిపాలనలో వరంగల్ మేయర్గా వ్యవహరించింది ఎవరు, శాసనసభ్యులుగా వ్యవహరించింది ఎవరు అంటూ ప్రశ్నించారు. పూటకో మాట రోజుకో వేషం వేసేవాడిని నేను కాదు…ఎవరి హయాంలో పర్మిషన్లు వచ్చాయని నిలదీశారు. దమ్ముంటే రండి.. ఆ సమయంలో నువ్వు ఎమ్మెల్యే వే.. వాళ్లు ప్రస్తుత ఎమ్మెల్యేని ముఖాముఖి మాట్లాడుకుందామంటూ సవాల్ విసిరారు.
నమ్మిన ప్రజలను మోసం చేయడం నాకు రాదు..నికార్సైన రాజకీయాలు చేసే వాడిని నేను అంటూ సారయ్య స్పష్టం చేశారు. నువ్వు ఎమ్మెల్యేగా మేయర్ గా పనిచేసిన కాలంలో ఆజం జహీ మిల్లు కార్మికుల న్యాయం కోసం ఒక్క లెటర్ రాసావా..నరేందర్ అంటూ ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కుమ్మక్క అయ్యారా.. మరి ఎందుకు కార్మికుల కోసం పోరాటం చేయడం లేదు..అంటూ అటు నరేందర్‌ను ఇటు కొండా సురేఖ పై విమర్శలు ఎక్కుపెట్టారు.