Eetala Rajender | రేవంత్‌.. కేసీఆర్‌ చేసిన తప్పే చేస్తున్నావ్‌.. నీ చిట్టా మొత్తం మా దగ్గరుంది!

  • By: TAAZ    news    May 21, 2025 1:44 PM IST
Eetala Rajender |  రేవంత్‌.. కేసీఆర్‌ చేసిన తప్పే చేస్తున్నావ్‌.. నీ చిట్టా మొత్తం మా దగ్గరుంది!

Eetala Rajender | కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తాను భయపడబోనని..విచారణకు తాను వంద శాతం హాజరవుతానని మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై స్పందించిన ఈటెల రాజేందర్ నోటీసులకు భయపడేది లేదన్నారు. నాకు ఇంకా నాకు నోటీసులు అందలేదన్నారు. బీజేపీ పార్టీ హైకమాండ్ అనుమతి తీసుకొని నోటీసులపై స్పందిస్తానని తెలిపారు. కమిషన్ గడువు ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలన్నారు. అసలు కమిషన్ వేసింది ప్రజల కోసమా లేక మా లాంటి వారిని బ్లాక్ మెయిలింగ్ కోసమా అని ఈటల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నాతో పాటు మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారని గుర్తు చేశారు.

కేసీఆర్ మంత్రివర్గంలో నాతో పాటు మంత్రులుగా పనిచేసిన తుమ్మల, జూపల్లి, కడియం కు ఏం జరిగిందో తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎవరి మాటైనా వింటారా…ఆయన అనుకున్నదే చేస్తరన్న సంగతి వారికి కూడా తెల్వాదా అని ఈటల పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా బడ్జెట్ అనుసరించి అన్నింటికి నిధులను నేనే ఇచ్చానని..కాళేశ్వరంకు కూడా బడ్జెట్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణా రావునే ప్రస్తుత సీఎస్ గా ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిదే అని..ఆయన ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చన్నారు. ఆనాడు దేవరాయాంజాల్ భూముల విషయంలో కేసీఆర్ చేసిన తప్పే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మమల్ని బెదిరిస్తే భయపడబోమని..కేంద్రంలో మేమే ఉన్నామని..నీ చిట్టా అంత మా చేతిలో ఉందన్నారు. నీ దిక్కుమాలిన చిల్లర గాళ్ళతో మాట్లాడిస్తే నేను వెనక్కి పోనని ఈటల స్పష్టం చేశారు.