Vidaa Muyarchi: మా సినిమా కాపీ కొట్టారు.. రూ.150 కోట్లు కట్టాల్సిందే

VidaaMuyarchi
తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) నటిస్తోన్న కొత్త చిత్రం ‘విదాముయార్చి’(Vidaa Muyarchi). దాదాపు రెండేండ్ల గ్యాప్ తర్వాత అజిత్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ డిసెంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రావాలని మేకర్స్ ఫ్లాన్ చేశారు.
ఈ నేపథ్యంలో మూవీ టీజర్ రిలీజ్ చేయగా మంచి బజ్ రావడంతో పాటు ఇప్పడు మొత్తం సినిమాకే చిక్కులు తీసుకు వచ్చింది. ఈ టీజర్ విడుదలైన రెండు రోజులకే ఈ చిత్రం మా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ‘బ్రేక్ డౌన్’ సినిమాను కాపీ చేశారంటూ ప్రముఖ హాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థ పారామౌంట్ సీరియస్ అయింది. లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
దీంతో ఈ మూవీ విడుదలపై తీవ్ర సందిగ్ధం నెలకొంది. అయితే మా బ్రేక్ డౌన్ సినిమాను కాపీ చేసినందుకు గాను రూ.150 కోట్లు చెల్లించాలంటూ సదరు హాలీవుడ్ సినిమా నిర్మాతలు డిమాండ్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించి వారితో చర్చలు జరుపుతున్నామని త్వరలో ఈ సమస్య సద్ధుమణుగుతుందని త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో త్రిష కథానాయిక కాగా అర్జున్, ఆరవ్, రెజీనా, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తుండగా భారీ నిర్మాణ సంస్థ లైకా నిర్మిస్తోంది.