Rs praveen kumar: గాంధీభవన్‌లో ఎఫ్ఐఆర్‌లు.. బీఆర్ఎస్ నేత ఆరోపణ

Rs praveen kumar: విధాత, హైదరాబాద్ః కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గాంధీ భవన్ లోన ఎఫ్ఐఆర్ లు రెడీ అవుతున్నాయని విమర్శించారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం.. ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తుండటంతోనే ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 14 కేసులను పెట్టిందని.. వాటిలో అనేక కేసులు హైకోర్టు కొట్టేసిందని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ప్లాట్‌ఫారంపై నిలబెట్టేందుకు కేటీఆర్ తెచ్చిన ఫార్ములా ఈ రేస్ పైనూ దుష్ప్రచారం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో అసలు అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్ ఖాతాలోకి ఒక్క రూపాయి అయినా వెళ్లిందా? అని ప్రశ్నించారు.