హీరోలకు నగదు చెల్లింపులు.. రెండో రోజు దిల్ రాజు కుటుంబంలో విస్తృతంగా ఐటీ దాడులు

విధాత: టాలీవుడ్ లో సినిమా నిర్మాణ సంస్దలపై ఐటీ దాడులు (IT RIDES) కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు అగ్ర నిర్మాణ సంస్దలతో పాటు వాటితో వ్యాపార లావాదేవిలున్న కంపెనీలు వ్యక్తులపై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఇటీవల వీరు నిర్మించిన సినిమాల వసూళ్లు .. పోస్టర్స్ లో భారీగా ఉన్నాయని.. కానీ వాస్తవంలో అవి తక్కువ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోల పర్సనల్ టీమ్స్ పీఆర్ టీమ్స్ కలిసి కావాలనే కలెక్షన్ నెంబర్స్ భారీగా చూపిస్తూ పోస్టర్లు వేయిస్తారనే విషయం చిత్ర పరిశ్రమలోని వారికి తెలిసిందే. అందుకే సదరు సినిమాల నిర్మాణ సంస్దలపై ఐటీ దాడులు జరుతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఐటీ అధికారులు కేవలం వీటి పైనే ఎక్కువ దృష్టి పెట్టలేదని తెలుస్తొంది. ఇటు దిల్ రాజు (Dil Raju), అటు మైత్రీ (Mythri) సంస్దలు వరుస సినిమాలు నిర్మిస్తున్నాయి. వాటికి బడ్జెట్ కెటాయింపుల పరంగా , రెమ్యూనరేషన్ల విషయంలో తేడాలున్నాయనే సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు చెస్తున్నట్లు సమాచారం. ఏ వ్యాపారమైనా ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే జరుగుతొంది. సినిమాల బిజినెస్ కూడా నిర్మాతలు, పంపిణీదారులు మ్యాగ్జిమమ్ ఆన్ లైన్లోనే నిర్వహిస్తున్నటప్పటికీ రెమ్యూనిరేషన్ ల విషయంలో క్యాష్ చెల్లింపులను కొందరు హీరోలు దర్శకులు కోరుకొవటం, అది కూడా భారీ ఎమౌంట్స్ కావటంతో. అగ్ర నిర్మాణ సంస్దలు వారి కోసం డబ్బును ఏర్పాటే చేయాల్సిన పరిస్థితి ఉందనే ప్రచారం ఉంది.
అందుకోసం ఫైనాన్సియర్స్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకోవటంతో పాటు , తిరిగి వడ్డీలను కూడా క్యాష్ రూపంలో చెల్లించాల్సి రావటం.. అదంతా కూడా అధికారిక లెక్కలలోకి ఎక్కించలేని పరిస్దితి నెలకొందనే టాక్ నడుస్తొంది. దాదాపు ప్రతి హీరోకి కొంత మేర క్యాష్ రూపేణా ఇచ్చుకోవాల్సి వస్తుండటం వల్ల నిర్మాతలకు దాన్ని సర్దుబాటు చేయటం భారంగా మారుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న ఐటీ సోదాలలో ఈ తరహా క్యాష్ చెల్లింపులపైనే అధికారులు దృష్టి సారించారని ఈ క్రమంలో ఎవరైనా హీరోల పై కూడా ఐటీ సోదాలు జరుగుతాయా అనే ప్రశ్న లు తలెత్తుతున్నాయి.
ఇక రెండు అగ్ర నిర్మాణ సంస్దలపై ఐటీ దాడులతో, మరికొందరు నిర్మాతలు హైదరాబాదు వదిలేసి వెళ్లినట్లుగా తెలుస్తొంది. సంక్రాంతికి ఓ హిట్ సినిమాను తీసిన యువ నిర్మాత గత రెండు రోజులుగా అందుబాటులో లేడని, మరికొందరు తమపై కూడా ఎక్కడ ఐటీ నజర్ పడుతుందోనని భయ పడుతున్నట్లు సమాచారం మరోవైపు నిన్న దిల్ రాజు (Dil Raju) కార్యాలయాలు,ఇండ్లలో సోదాలు చేసిన అధికారులు తాజాగా బుధవారం దిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి (Hansitha Reddy) ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో హన్సిత రెడ్డి సమక్షంలో ఇంట్లోని డిజిటల్ లాకర్లను ఐటీ అధికారులు ఓపెన్ చేశారు. మరికొద్ది సేపట్లో బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు. ఈ సోదాల నేపథ్యంలో దిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి, కుటుంబ సభ్యులు ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకున్నారు. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతుండగా.. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సుకుమార్ ను ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. కాగా పుష్ప 2 సినిమాకు సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యం వహించింది.