Hyderabad: ఇన్ కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు!

విధాత : హైదరాబాద్ ఇన్ కమ్ టాక్స్ అధికారులపై సీబీఐ కేసు సంచలనంగా మారింది. ఇన్ కమ్ టాక్స్ రహస్య డేటాను ప్రైవేటు వ్యక్తులకు చేరవేస్తున్న అధికారులను సీబీఐ తన సోదాల్లో గుర్తించింది. ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసిన సీబీఐ పన్ను చెల్లించే వారిని మోసం చేస్తున్న అధికారులపై కేసులు నమోదు చేసింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఇన్ కమ్ టాక్స్ డేటాను లీక్ చేస్తున్న ఐటీ ఇన్ స్పెక్టర్ గుల్ నాజ్ రవూఫ్, కుత్తాడి శ్రీనివాస్, సీనియర్ టాక్స్ అసిస్టెంట్స్ ఖుమర్ ఆలం, మనీష్, జావేద్ లను అరెస్టు చేశారు. చార్టర్ అకౌంటెంట్ పులిమామిడి భగత్ పై కేసు నమోదు చేసింది.