సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ

విధాత‌: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పలువురు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్లపై కౌంటర్​ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. లేపాక్షి, ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల కేసుల్లో జగన్ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. జగన్ డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు సీబీఐ గడువు కోరింది. మరోవైపు లేపాక్షి, ఇళ్ల ప్రాజెక్టుల కేసుల్లో విజయసాయి […]

  • Publish Date - September 3, 2021 / 11:48 AM IST

విధాత‌: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పలువురు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్లపై కౌంటర్​ దాఖలుకు సీబీఐ గడువు కోరింది.

హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. లేపాక్షి, ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల కేసుల్లో జగన్ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. జగన్ డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు సీబీఐ గడువు కోరింది. మరోవైపు లేపాక్షి, ఇళ్ల ప్రాజెక్టుల కేసుల్లో విజయసాయి వేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. జగతి పబ్లికేషన్స్ డిశ్చార్జ్ పిటిషన్, కార్మెల్ ఏషియా డిశ్చార్జ్ పిటిషన్​తో పాటు బి.పి. ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కోర్టుని గడువు కోరింది.