Revanth Reddy: BJP MP డీకే అరుణకు.. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్!
విధాత: బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి డీ.కే.అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఘటన జరిగిన తీరును, తన అనుమానాలను ఈ సందర్భంగా అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నాకు భద్రత పెంచాలని సీఎంను ఎంపీ అరుణ కోరారు. అరుణ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి ఆమెకు, ఇంటి వద్ధ భద్రత పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే ఎంపీ అరుణకు భద్రత పెంచాలంటూ పోలీసు శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. జరిగిన ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసు శాఖను ఆదేశించారు.

కాగా ఇంట్లో ఆగంతకుడు చొరబడిన విషయమై సీఎం రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని ఎంపీ డీ.కే. అరుణ తెలిపారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు ముట్టుకోకుండానే ఆగంతకుడు వెళ్ళిపోయాడని, నాకు ఎవరిపైనా అనుమానం కూడా లేదని చెప్పడం జరిగిందన్నారు. కెమెరాల వైర్ కట్ చేశాడని..ఇతర కెమెరాలను పక్కకు మళ్లించాడని, దాదాపు గంటన్నరకు పైగా ఇంట్లో తచ్చాడాడని..అతను ఇల్లు అంతా తిరిగిన ఎలాంటి వస్తువు తీసుకెళ్లలేదన్నారు. రాజకీయంగా నాపై కక్ష కట్టి ఎవరైనా పంపించారో తెలియదని అరుణ చెప్పుకొచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, దర్యాప్తు పూర్తి అయితే పూర్తి స్పష్టత వస్తుందన్నారు. నాకు, ఇంటి వద్ధత భద్రత పెంచమని ముఖ్యమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram