Diabetes | అధిక బరువే కాదు.. వీటితోనూ డయాబెటిస్‌ ముప్పు..!

Diabetes | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఎదుర్కొంటున్న సమస్యలో డయాబెటిస్‌ సైతం ఒకటి. అయితే, మధుమేహానికి అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, హైబీపీయే కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే, జన్యుపరంగా కొందరిలో డయాబెటిస్‌ వస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటితో పాటు మరికొన్ని కారణాలతో డయాబెటిస్‌ ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. వాయు కాలుష్యంతో సైతం డయాబెటిస్‌ పెరగడానికి కారణమని.. అలాగే క్రిమిసంహారకాలు జల్లిన ఆహార పదార్థాలు, […]

Diabetes | అధిక బరువే కాదు.. వీటితోనూ డయాబెటిస్‌ ముప్పు..!

Diabetes |

మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఎదుర్కొంటున్న సమస్యలో డయాబెటిస్‌ సైతం ఒకటి. అయితే, మధుమేహానికి అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, హైబీపీయే కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే, జన్యుపరంగా కొందరిలో డయాబెటిస్‌ వస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

వీటితో పాటు మరికొన్ని కారణాలతో డయాబెటిస్‌ ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు. వాయు కాలుష్యంతో సైతం డయాబెటిస్‌ పెరగడానికి కారణమని.. అలాగే క్రిమిసంహారకాలు జల్లిన ఆహార పదార్థాలు, నాన్‌స్టిక్ పాత్రలు, నిద్రలేమి, పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా సైతం డయాబెటిస్‌ ముప్పును పెంచుతాయని పేర్కొంది.

పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా దాని బారి నుంచి రక్షించుకోవచ్చని చెబుతున్నారు. గతంలో ఎక్కువగా ఐదుపదుల వయసులో ఉన్న వారికి మాత్రమే డయాబెటిస్‌ వచ్చేది. ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా డయాబెటిస్‌ పెరుగుతున్నది. వాయు కాలుష్యం సైతం డయాబెటిస్‌ను పెంచుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గాలి, నీరు, భూమి కలుషితమైన సమయంలో వాటి ద్వారా వచ్చే ఆహార పదార్థాలను తీసుకున్న సమయంలో మధుమేహం బారినపడే ప్రమాదం ఉంటుందన్నారు. ముఖ్యంగా గాలి కాలుష్యంలో కొన్ని రకాల లోహాలు శ్వాస ద్వారా డయాబెటిస్ బారినపడేలా చేస్తాయని, ఈ పరిస్థితుల్లో వాయు కాలుష్య ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

పంట పొలాల్లో చీడపీడల నివారణకు క్రిమి సంహారక మందులు, ఎరువులను వినియోగిస్తుంటారు. వీటితో కూడా డయాబెటిస్‌ వచ్చే అవకాశాలను పెంచుతాయి. ఇప్పటికే పలు అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.

క్రిమిసంహారక మందులకు ప్రత్యక్షంగా గురయ్యే వారు త్వరగా ప్రభావితం ప్రభావితమవుతారని, భూమి లోపలికి ఇంకిపోయి భూమిని, మొక్కని, కాసే పంట సైతం ప్రమాదకరంగా మారుతుందని పేర్కొంటున్నారు. కూరగాయలను బాగా కడగాలని, ఎక్కువ సేపు ఉడించిన తర్వాత తినాలని సూచిస్తున్నారు.

అలాగే ప్లాస్టిక్‌ పరిశ్రమల్లో పని చేసే వారు సైతం షుగర్‌ వ్యాధి బారినపడుతున్నారు. ప్లాస్టిక్‌లో హానికారక బీపీఏ ఉంటుంది. ఇది శ్వాస ద్వారా సూక్ష్మ రూపంలో ఊపిరితిత్తుల్లోకి చేరి ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, సంతానలేమికి కారణమవుతాయి. అలాగే డయాబెటిస్‌కు కారణమవుతాయి.

పేగుల్లో బ్యాక్టీరియా చేరి మధుమేహం బారిన త్వరగా పడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తాగే నీళ్లు, తీసుకునే శ్వాస, తీసుకునే ఆహారం స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.