Diabetes Diet Green Peas | పచ్చి బఠానితో చక్కెరకు చెక్
డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచడంలో ఆహారం కీలకమైంది. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చక్కెర వ్యాధిని నియంత్రించడంలో ముందుంటాయి. అలాంటి వాటిలో ఒకటి బఠాని.
Diabetes Diet Green Peas | టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు డైట్ విషయంలో శ్రద్ధ వహిస్తే షుగర్ లెవల్స్ ని సులువుగా నియంత్రించుకోవచ్చు. రక్తంలో గ్లూకోజ్ పెంచని పదార్థాలు, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేవి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే షుగర్ అదుపులో ఉంటుంది. ఇందుకు పనికొచ్చే ఆహార పదార్థాల్లో పచ్చి బఠాని గింజలు కూడా మంచివే.
ఈ బఠానీలు చాలా తక్కువ కేలరీలను ఇస్తాయి. అందువల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. అంతేకాదు, వీటిలో ఉండే ఫైబర్ అంత త్వరగా ఆకలి కానీయదు. దీని వల్ల తిండి మీద కోరిక తగ్గి ఆహారం తక్కువగా తీసుకుంటారు. కాబట్టి అధిక బరువు సమస్య ఉండదు. అలాగే పచ్చి బఠానీల్లో ఉండే పొటాషియం షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. హైబీపీ రాకుండా చూస్తుంది. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరానికి పోషణ అందుతుంది.
వర్షం పడినప్పుడు గానీ, భోజనం తరువాత బోర్ గా ఉన్నా, ఆకలి లేకపోయినా ఏవైనా తినాలనే క్రేవింగ్ పచ్చి బఠానిలు మంచి ఆప్షన్. బఠానీలను స్నాక్స్ గా తీసుకుంటే రుచితో పాటు, కేలరీలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. అందుకే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు ప్రతిరోజూ పచ్చి బఠానీలను తమ ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్‌ను చాలా సులభంగా నియంత్రణలో ఉంచవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram