SalmanKhan: సల్మాన్ ఖాన్ కొత్త ‘అయోధ్య రామ్‌’ వాచ్ ధ‌ర‌ ఎంతో తెలుసా! దాని ప్ర‌త్యేక‌త‌లివే

  • By: sr    news    Mar 29, 2025 8:01 PM IST
SalmanKhan: సల్మాన్ ఖాన్ కొత్త ‘అయోధ్య రామ్‌’ వాచ్ ధ‌ర‌ ఎంతో తెలుసా! దాని ప్ర‌త్యేక‌త‌లివే

SalmanKhan:

విధాత: బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ (salmankhan) తన సికిందర్ (Sikandar) సినిమా విడుదల ప్రమోషన్ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. లగ్జరీ బ్రాండ్ జాకబ్ & కో సంస్థ రూపొందించిన పరిమిత ఎడిషన్ రామ జన్మభూమి వాచ్‌ను చేతికి పెట్టుకుని ఉన్న‌ ఫోటోలను పోస్టు చేసిన సల్మాన్ “మార్చి 30న థియేటర్లలో కలుద్దాం” అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ ఫొటో సోష‌ల్‌ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది. ప్ర‌తి ఒక్క‌రు స‌ల్మాన్ లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేయ‌డంతో పాటు తాను ధ‌రించిన వాచ్ గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు.

అయితే.. ఆ ఫోటోల్లో సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ విలువ అనేక ప్ర‌త్యేక‌త‌ల‌ను క‌లిగి ఉంది. అందులో ముఖ్యంగా వాచ్‌ రూ.60లక్షల విలువైంది కావడం విశేషం. 2024లో ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో జరిగిన‌ రామ మందిర ప్రతిష్టాపన వేడుకకు గుర్తుగా ఈ గడియారాన్ని రెండు ఎడిషన్లలో తయారు చేశారు. ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి రోజ్ గోల్డ్ ఎడిషన్’ అని పిలువబడే ఈ అద్భుతమైన టైమ్‌పీస్ లగ్జరీ బ్రాండ్ వాచ్‌లో అయోధ్య రామమందిరం, రాముడు, హనుమంతుడు, కుంకుమ పువ్వు ఇతర పవిత్ర చిహ్నాలు ఉన్నాయి. కాషాయ రంగులో హిందూత్వ ప్రధాన విలువలు, ఆధ్యాత్మిక సంస్కృతులకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్రత్యేక వాచ్‌ను సల్మాన్ ధరించడం విశేషం. ఈ విష‌యం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం కాగా స ల్మాన్‌కు త‌మ మ‌త పెద్ద‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేఖ‌త వ‌స్తోంది.

గతంలో రెండు నెలల క్రితం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ప్రారంభోత్సవం సందర్భంగా నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ఈ త‌ర‌హా గడియారాన్నే ధరించి కనిపించారు. ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 అనే వాచ్ ను అభిషేక్ బచ్చన్ ధరించారు. సల్మాన్ ఖాన్, రష్మికలు నటించిన సికిందర్ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా విడుదల కానుంది.