గతంలో ఎక్కువ మంది రావాలని రూ.300 ఇచ్చేది.. ఇప్పుడు BRS సభకు అంత అవసరం లేదు! ఎర్రబెల్లి వ్యాఖ్యలు వైరల్

విధాత: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎక్కువ మంది జనాలు రావాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. రజతోత్సవ సభ సన్నాహకాలలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో మన సభలకు ఎక్కువ మంది రావాలని రూ.200నుంచి రూ.300 ఇచ్చేదన్నారు. ఈ సభకు ఎంతమందిని తీసుకరావాలని నేను చెప్పనని.. మీరే మీ ఊర్లలలో అనుకూలత మేరకు మందిని తీసుకుని రావాలన్నారు. ఎట్లా వస్తే మంచిదన్నది మీరే నిర్ణయించుకోవాలన్నారు.
దయాకర్ వ్యాఖ్యలు చూస్తే అధికారంలో ఉన్నప్పుడు జనసమీకరణకు భారీగా ఖర్చు పెట్టగలిగామని..ప్రతిపక్షంగా ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేనందునా జనసమీకరణ స్వచ్చందంగా సాగాలని కేడర్ కు మార్గదర్శకం చేశారంటున్నారు.
అయితే ఓ వైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా జనసమీకరణ చేయాలని చెప్పగా.. ఎర్రబెల్లి మాత్రం స్వచ్చంద జనసమీకరణ మాటలు చెప్పడం గమనార్హం. ఇప్పటికే వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్స సభకు పార్టీ అధిష్టానం భారీ ఏర్పాట్లు చేస్తుంది. లక్షలాది జనసమీకరణ చేయాలని కేసీఆర్ నిర్దేశించారు.