Health Insurance: కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.. ఏడాది ప్రీమియం కట్టక్కర్లే
-
పర్సనల్ యాక్సిడెంట్ షీల్డ్ పోర్ట్‌ఫోలియోను ఆవిష్కరించిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్
-
ఒక సంవత్సరం ప్రీమియం మినహాయింపుతో ₹75 లక్షల వరకు కవరేజీ
Health Insurance:
హెల్త్ ఇన్సూరెన్స్‌లు తీసుకునే వారు ఎన్నో రకాలుగా ఫిల్టర్ చేసి తమకు అత్యుత్తమైనది అని భావించే ఇన్సూరెన్స్‌నే తీసుకుంటారు. అయితే ఇన్సూరెన్స్‌కి సంబంధించి అన్ని అంశాలు మనల్ని సంతృప్తి పరచకపోవచ్చు.అయితే ‘గెలాక్సీ పర్సనల్ యాక్సిడెంట్ షీల్డ్’ ద్వారా గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ వ్యక్తిగత ప్రమాద కవరేజీని అందిస్తోంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబాలకు మద్దతు అందించడం, స్థిరత్వం, మనశ్శాంతిని కలిగించేలా దీనిని రూపొందించారు. ఫ్లెక్సిబుల్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లతో, పాలసీ ₹75 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది. వ్యక్తిగత ప్లాన్‌లలో, బీమా చేయబడిన వ్యక్తి యొక్క సంపాదన సామర్థ్యాన్ని బట్టి గరిష్ట బీమా మొత్తం మారుతుంది.
ఈ పాలసీలోని ఓ ముఖ్యమైన లక్షణం ఏంటంటే… బీమా చేయబడిన వ్యక్తి రోడ్డు ప్రమాదం కారణంగా మరణిస్తే, వారి కుటుంబానికి ఒక సంవత్సరం ప్రీమియం మినహాయింపునిస్తారు. అంటే ఆ సంవత్సరం వారి కుటుంబం ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. తద్వారా బాధిత కుటుంబం తక్షణమే ఆర్థిక ఇబ్బందులు పడకూడదనేది తమ ముఖ్య ఉద్దేశమని గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో జి. శ్రీనివాసన్ తెలిపారు.

“బీమాలో నిజమైన ఆవిష్కరణ అంటే కేవలం ఉత్పత్తుల గురించి కాదు, అది మానవ అవసరాలను అర్థం చేసుకోవడం. అవసరమైన సందర్భాల్లో సానుభూతితో స్పందించడం. సంక్షోభ సమయాల్లో ఆర్థిక భద్రత అనేది ప్రతి ఒక్కరి అవసరం. చాలా మందికి వ్యక్తిగత ప్రమాద కవరేజ్ ఎలా కాపాడుతుందో తెలియదు. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం” అని శ్రీనివాసన్ చెప్పారు.
దేశవ్యాప్తంగా ఏటా వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో కొందరు శాశ్వత అంగవైకల్యం బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఫ్లోటర్ పాలసీ ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవడం మాత్రమే కాకుండా… ఆ ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం, పాక్షిక వైకల్యం పొందిన వారికి ఉపయోగపడుతుంది. బాధితుడి పిల్లల చదువులకు తదితర అంశాల్లోనూ అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram