Telangana phone tapping case| ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు రావాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.
విధాత, హైదరాబాద్ :తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Telangana phone tapping case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు రావాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు(Santosh Rao)కు సిట్(SIT) నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. రేపటి సిట్ విచారణకు హాజరవుతానని, పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తానని సంతోష్ రావు తెలిపారు.
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే.ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికే చెందిన సంతోష్ రావును కూడా విచారణకు పిలవడంతో తదుపరి వంతు ఎవరిదన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. రేపో ఎల్లుండో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు కూడా సిట్ విచారణ నోటీసులు పంపవచ్చని తెలుస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram