Telangana: రేష‌న్‌కార్డ్ దారుల‌కు శుభ‌వార్త‌.. బియ్యంతో పాటు 9రకాల సరుకుల కిట్ !

  • By: sr    news    Apr 03, 2025 2:37 PM IST
Telangana: రేష‌న్‌కార్డ్ దారుల‌కు శుభ‌వార్త‌.. బియ్యంతో పాటు 9రకాల సరుకుల కిట్ !

రేషన్ బియ్యంతో పాటు 9రకాల సరుకుల కిట్ !
విధాత: దేశంలోనే విప్లవాత్మక రీతిలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తెల్లరేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. సన్న బియ్యంతో పాటు 9రకాల నిత్యవసర సరుకులతో కూడిన కిట్ ను కూడా పేదలకు అందించేందుకు కసరత్తు చేస్తుంది.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అమ్మహస్తం పేరుతో 9రకాల సరుకులను పంపిణీ చేశారు. అదే తరహాలో ఇందిరమ్మ అభయ హస్తం పేరుతు 9రకాల నిత్యావసర సరుకుల కిట్ ను అందించాలని నిర్ణయించింది. ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేయనున్నారన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రభుత్వం 9సరుకుల కిట్ పంపిణీ చేపడితే ఇప్పటికే సన్న బియ్యం లబ్థిదారులుగా ఉన్న 3.10కోట్ల మందికి మరింత మేలు జరుగనుంది. దొడ్డు బియ్యం పంపిణీలో చాలమంది రేషన్ కార్డు దారులు వాటిని తినలేక విక్రయించుకోవడంతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టినట్లయ్యింది.ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో పెద్ద ఎత్తున లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పట్ల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.